బాపట్లలో కుక్క కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగి…ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్ల జిల్లా కోలలపూడి జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై కనిపించిన కుక్కను తప్పించుకోవాలని ప్రయత్నం చేశారు కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు. అయితే అదుపు తప్పి ఆ కారు… డివైడర్‌ను ఢీకొట్టి ఘోరం సృష్టించింది.

దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొక ఇద్దరు గాయపడ్డారు. దీంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తింపు అయ్యింది. మృతులు దామర్ల లక్ష్మణ్ (70), సుబ్బాయమ్మ (65), హేమంత్ (25) గా గుర్తించారు. వీరు తిరుపతి నుండి పిఠాపురం దేవాలయంలో పిత్రుదేవతలకు పిండప్రదానం చేయడానికి వెళ్తుండగా ఈ ఘోరం చోటు చేసుకుంది. ఈ ఘటనపై లోతైన విచారం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అటు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. =