పని చేసే మహిళలకు సురక్షిత వసతి.. సఖి నివాస్ పథకం!

-

యువతులు ఉన్నత విద్య కోసం, మహిళలు ఉద్యోగాల కోసం తమ సొంత ఊరు దాటి నగరాలకు వెళ్లినప్పుడు ఎదురయ్యే అతిపెద్ద సమస్య సురక్షితమైన వసతి. అధిక అద్దెలు, భద్రతాపరమైన భయాల మధ్య పనిచేసే మహిళలకు ప్రభుత్వం ఒక గొప్ప పరిష్కారాన్ని చూపించింది. అదే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “సఖి నివాస్” పథకం. ఈ పథకం పని చేసే మహిళలకు తక్కువ ధరకు అన్ని సౌకర్యాలతో కూడిన సురక్షితమైన వసతిని అందించి, వారి ఆర్థిక స్వాతంత్ర్యానికి భరోసా ఇస్తుంది. ఈ పథకం వివరాలు తెలుసుకుందాం.

సఖి నివాస్ పథకం: పని చేసే మహిళలు, శిక్షణ పొందుతున్న యువతులకు సురక్షిత వసతిని కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘సఖి నివాస్’ (వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్) పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఎప్పుడు ప్రారంభించారు: కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Women and Child Development) ఈ పథకాన్ని మిషన్ శక్తి (Mission Shakti) లోని సమర్థ్య (Samarthya) ఉప పథకంలో భాగంగా అమలు చేస్తోంది. ఈ పథకం 2017-18 సంవత్సరంలో ‘వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్’ పథకంగా ప్రారంభమై, తర్వాత ‘సఖి నివాస్’గా పేరు మార్చబడింది.

Safe Housing for Working Women – Sakhi Nivas Scheme
Safe Housing for Working Women – Sakhi Nivas Scheme

ముఖ్య ఉద్దేశం: సఖి నివాస్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, ఉద్యోగాలు చేసే మహిళలకు, వృత్తిపరమైన శిక్షణ తీసుకుంటున్న యువతులకు నగర ప్రాంతాలలో సురక్షితమైన, సౌకర్యవంతమైన, మరియు తక్కువ ధరకు వసతి కల్పించడం. మహిళలు తమ కెరీర్‌లను కొనసాగించడానికి, ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగడానికి తోడ్పడడం. వసతి గృహంలో ఉండే మహిళల పిల్లల కోసం డే-కేర్ సెంటర్ (Day Care Centre) సదుపాయం కల్పించడం, తద్వారా వారు ఎలాంటి ఆందోళన లేకుండా పని చేసుకోడానికి వీలు కల్పించడం.

సఖి నివాస్ పథకానికి ఎవరు అర్హులు: ఈ పథకం పని చేసే మహిళల కోసం రూపొందించబడింది. ఇందులో కింది వర్గాలకు చెందిన మహిళలు అర్హులు. ఉద్యోగం చేసే మహిళలు, ఉద్యోగ నిమిత్తం తమ సొంత ఊరు లేదా ఇంటికి దూరంగా ఉండే మహిళలు. వీరు నామమాత్రపు ఫీజు చెల్లించి ఈ వసతిని పొందవచ్చు. ఉన్నత విద్య,వృత్తిపరమైన శిక్షణ పొందుతున్న మహిళలు, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న లేదా వృత్తిపరమైన శిక్షణ పొందుతున్న యువతులు.అంతేకాక వసతి గృహంలో ఉండే మహిళల పిల్లలకు (సాధారణంగా 18 సంవత్సరాల వరకు కుమార్తెలు, 12 సంవత్సరాల వరకు కుమారులు) డే-కేర్ సెంటర్‌తో పాటు వసతి కూడా కల్పిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలకు ఈ హాస్టళ్లలో ప్రవేశానికి ప్రాధాన్యత ఇస్తారు.

సఖి నివాస్ పథకం అనేది భారతదేశంలో మహిళా సాధికారతకు ఒక బలమైన పునాది. సురక్షితమైన నివాసాన్ని పిల్లల సంరక్షణ సదుపాయాన్ని కల్పించడం ద్వారా మహిళలు ధైర్యంగా పట్టణ ప్రాంతాలకు వెళ్లి, ఉన్నత చదువులు చదువుకోవడానికి మరియు ఉద్యోగాలు చేయడానికీ వీలు కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా మహిళలు వృత్తిపరంగా అభివృద్ధి చెంది, దేశ ఆర్థిక వ్యవస్థలో చురుకైన పాత్ర పోషించగలుగుతారు.

గమనిక: సఖి నివాస్ వసతి గృహాలలో వసతిని పొందడానికి, మహిళలు ఆయా రాష్ట్రాల మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా లేదా నేరుగా ఆయా నగరాల్లోని సఖి నివాస్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news