ఫాఫం కల్లు బాధితులు… గోడతో కబుర్లు చెప్తున్నారు…!

-

నేను బోతుంటే అడ్డం వస్తవా…? ఎం మనిషి అంటే లెక్క లేదా నీకు…? అడ్డు లేస్తున్నవా లేదా…? నువ్వు తప్పుకోకపోతే నేనే తప్పుకుంటా…? నీ మొహం నాకు చూపీయకు. సీన్ వన్. నేను రోజూ నిన్నే కదా వేసుకునేది… ఎం ఇయ్యాల స్పెసల్ గా వేసుకోవాలా…? చెప్పేది ఇనపిస్త లేదా…? సీన్ 2. అన్నం నాకు పెట్టమని అడిగానా…? ఎవడు వండమన్నడే నిన్ను…? నీ పుట్టింటికి జావ్. పోతావా జుట్టు పట్టుకుని ఈడవాలా…? సీన్ 3.

ఏంటీ గోల అనుకుంటున్నారా…? ఏమీ లేదు గురూ తెలంగాణాలో, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కల్తీ కల్లు దొరకక జనాలకు పిచ్చి ఎక్కింది. మనకు ఎందుకు గాని ఎవరి బాధలు వాళ్ళవి. కరోనా వైరస్ పుణ్యమా అని తెలంగాణాలో మద్యం షాపులు బంద్ అయ్యే సరికి జనాలకు మైండ్ పోయింది. ఇన్నాళ్ళు మద్యం తాగీ తాగీ వారం, పది రోజుల నుంచి కనీసం తీర్దానికి కూడా దొరకక ఇప్పుడు జనాలు చుక్కలు చూస్తున్నారు.

కొందరికి మానసిక సమస్యలు బయటపడుతున్నాయి. కొత్తగా ప్రవర్తిస్తున్నారు. పైన చెప్పిన సీన్ వన్ లో మాట్లాడింది గోడతో… సీన్ టూ లో మాట్లాడింది చొక్కాతో… సీన్ 3 లో మాట్లాడింది భార్యతో. ఇలాగే వింతగా ప్రవర్తిస్తున్నారు. కల్తీ కల్లు తాగిన వాళ్ళు ఇప్పుడు పెనాయిల్ తాగడం, డెటాల్ తాగడం ఇలా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉందీ ఈ బాధ. కరోనా బాధితుల కంటే ఈ బాధితుల సంఖ్య ఎక్కువైంది ఇప్పుడు.

హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక ఆస్పత్రికి క్యూ కట్టిన వాళ్ళలో ఎక్కువగా మందు బాబులే ఉన్నారు. మామూలు మందు తాగే వాళ్లకు ఏమో గాని కల్తీ కల్లుకి ఎక్కువగా అలవాటు పడ్డారు. కల్లు దుకాణాల్లో ఎక్కువగా తయారు చేసిన కల్లు ఉంటుంది. దీనితో అది తాగితేనే జనాలకు తాగినట్టు ఉంటుంది. లేకపోతే వాళ్లకు పిచ్చి ఎక్కుతూ ఉంటుంది. కల్తీ కల్లు బాధితుల సంఖ్య ఇప్పుడు రోజు రోజుకి పెరుగుతుంది.

అందులో కిక్ ఇవ్వడానికి గానూ ప్రత్యేక రసాయనాలు వాడుతూ ఉంటారు. దీనితో వాళ్లకు అది కిక్ ఇస్తుంది. ఇప్పుడు అది లేకపోయేసరికి ఎం చెయ్యాలో అర్ధం కావడం లేదు చాలా మందికి. దీనితో అనారోగ్య సమస్యలు ఎక్కువగానే ఉంటాయి. పూట పూటకు జీవితం హరించుకు పోతు ఉంటుంది. ఇప్పటి వరకు పది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనితో తెలంగాణా ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక చర్యలు చేపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news