కరోనా కల్లోలం… ఏమాత్రం తగ్గని రాజు గారు!

-

ఒకపక్క కరోనా మహమ్మారి తో ప్రపంచ దేశాలు అల్లాడిపోతుంటే థాయ్ లాండ్ రాజు మహా విజిరలోంగ్ కోర్న్ మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏమాత్రం తగ్గకుండా తనదైన శైలి లో ఎంజాయ్ చేస్తున్నారట. ప్రస్తుతం జర్మనీ లో ఉన్న ఆయన కరోనా తమ దరిచేరకుండా ఏకాంతంగా గడపాలని అనుకుంటున్నారట. అయితే ఇంతగా కరోనా కు భయపడుతున్న ఆయన మాత్రం రాజు హోదా కు ఏమాత్రం తగ్గకుండా ఒక హోటల్ మొత్తం అద్దెకు తీసుకొని అందులో తన ఉంపుడుగత్తెలను కూడా ఉంచినట్లు తెలుస్తుంది. జర్మనీ లోని బవేరియా లోని గ్రాండ్ హోటల్ సనెన్ బిచ్ ను మొత్తం తనకోసం బుక్ చేసుకున్నారట. ఆయనతో పాటు హోటల్ లో తన ఉంపుడుగత్తెలు,వారికి సేవలు చేయడానికి మరో 20 మంది పనివాళ్ళు మాత్రమే ఆ హోటల్ లో ఉన్నారంటూ జర్మనీ పత్రిక బిల్డ్ రిపోర్ట్ చేసింది. సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నంతకాలం తనకు సేవలు చేసేందుకు భారీ సంఖ్యలో సేవకులను తెచ్చుకోలని కూడా అనుకున్నారట. కానీ వారిలో ఎవరికైనా కరోనా ఉందేమోన్న అనుమానంతో జర్మనీ ప్రభుత్వం సేవకుల్లో 119 మందిని ఇంటికి పంపేసిందట. కరోనాతో అన్నిదేశాల మాదిరిగానే థాయ్‌లాండ్‌ ప్రజలు కూడా నానా కష్టాలూ పడుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఇలాంటి సమయంలో రాజుగారు ఆడుకుంటారు అని ప్రజలు ఎదురుచూస్తుంటే ఈయన గారు మాత్రం వేరే దేశానికి వెళ్లి ఇలా జల్సా గా ఒక హోటల్ ను బుక్ చేసుకొని మరీ ఉంపుడుగత్తెలతో ఎంజాయ్ చేస్తుండడం పై అందరూ మండిపడుతున్నారు. మాకు అసలు రాజు ఎందుకంటూ చాలామంది సోషల్‌మీడియాలో ప్రశ్నిస్తున్నారు కూడా.

Read more RELATED
Recommended to you

Latest news