గ్యాస్ సిలెండర్ వాడుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ చిన్న తేడా వచ్చినా సరే ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం అనేది తప్పనిసరి. దీని వలన చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కూడా. అయినా సరే కొందరు ఆశ్రద్దగా ప్రవర్తిస్తూ ఉంటారు. తాజాగా ఇలాగే చేసి క్రికెటర్ భార్య తీవ్ర గాయాల పాలు కావడం సంచలనంగా మారింది.
బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్ భార్య దేవశ్రీ బిస్వాస్ సంచిత ‘టీ’ కాచేందుకు వంట గదిలోకి వెళ్లి గ్యాస్ ఆన్ చేయగా సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీనితో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీని నుంచి ప్రాణాలతో ఆమె బయటపడింది. దీనిపై స్పందించిన సంచిత… ‘చావు దగ్గర వరకు వెళ్లి తప్పించుకున్నా. చేతులు అడ్డు పెట్టకోకుంటే ముఖమంతా కాలి పోయేదని… వంట గదిలో గ్యాస్ సిలిండర్ ఉపయోగించే సమయంలో జాగ్రత్తలు పాటించండని సూచించింది.