కరోనా వైరస్ నేపధ్యంలో ఇప్పుడు దేశం మొత్తం ఆర్ధిక ఇబ్బందులు పడుతుంది. కరోనా వైరస్ క్రమంగా దేశంలో విస్తరిస్తుంది. దీనితో లాక్ డౌన్ నిర్ణయం తప్పడం లేదు. దీనితో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భారీగా వడ్డీలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. బ్యాంకు లో డబ్బు దాచుకున్నారా…? పోస్ట్ ఆఫీస్ పథకాల్లో సేవింగ్స్ చేస్తున్నారా? సుకన్య సమృద్ధి యోజన-SSY, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్-PPF లాంటి స్కీమ్స్‌లో డబ్బులు పెట్టుబడి పెట్టారా…?
చిన్నమొత్తాల పొదుపు పథకాలపై భారీగా వడ్డీలు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. 70 నుంచి 140 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే 70 పైసల నుంచి 140 పైసల వరకు వడ్డీ తగ్గుతుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు తగ్గించిన వడ్డీ రేట్లు వర్తించనున్నాయి. ఆర్బిఐ ఇటీవల రేపో రేట్ ని కూడా భారీగా తగ్గించింది. ఏకంగా 75 బేసిస్ పాయింట్స్ రెపో రేట్ తగ్గించి సంచలన౦ సృష్టించింది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై ఏకంగా 80 బేసిస్ పాయింట్స్ అంటే 7.9 శాతం నుంచి 7.1 శాతానికి వడ్డీ తగ్గించాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై 110 బేసిస్ పాయింట్స్ అంటే 7.9 శాతం నుంచి 6.8 శాతానికి వడ్డీ తగ్గింది. కిసాన్ వికాస్ పత్రపై 70 బేసిస్ పాయింట్స్ అంటే 7.6 శాతం నుంచి 6.9 శాతానికి వడ్డీ తగ్గింది. 5 ఏళ్ల సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌పై ఏకంగా 120 బేసిస్ పాయింట్స్ అంటే 8.6 శాతం నుంచి 7.4 శాతానికి వడ్డీ తగ్గింది.
సేవింగ్స్ డిపాజిట్స్‌పై వడ్డీ ఏడాదికి 4 శాతంలో ఎలాంటి మార్పులు చేయలేదు. సుకన్య సమృద్ధి యోజనపై 80 బేసిస్ పాయింట్స్ అంటే 8.4 శాతం నుంచి 7.6 శాతానికి వడ్డీ తగ్గింది. 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్లపై 140 బేసిస్ పాయింట్స్ అంటే 7.2 శాతం నుంచి 5.8 శాతానికి వడ్డీ తగ్గింది. 5 ఏళ్ల టైమ్ డిపాజిట్ వడ్డీ 7.7 శాతం నుంచి 6.7 శాతానికి, మూడేళ్ల డిపాజిట్ వడ్డీ 6.9 శాతం నుంచి 5.5 శాతానికి వడ్డీ తగ్గింది.