ఇలాంటి పరిస్థితుల్లో విమర్శలు ఎందుకు బాబు గారు..?

-

ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి నానా తంటాలు పడుతోంది. ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం సీఎం జగన్ తనని సంప్రదించటం లేదని హైదరాబాదులో ఉంటూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి సరైన నిబద్ధత లేదు సరైన ప్లానింగ్ లేదు అంటూ హైదరాబాదులో తన నివాసంలో చంద్రబాబు మీడియా సమావేశాలు పెట్టడం పట్ల ఏపీ రాజకీయాల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.TDP chief Chandrababu Naidu to resign as Andhra Pradesh CM40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు, ఇటువంటి టైంలో మీడియా సమావేశాలలో ఇలాంటి కామెంట్లు చేయడం అవసరమా అంటూ జనాలు కూడా విమర్శలు చేస్తున్నారు. హుద్ హుద్, తిత్లీ తుఫాన్ వచ్చిన టైంలో తన పనితనాన్ని ప్రస్తావిస్తూ…ప్రస్తుతం ప్రపంచాన్ని విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ ని అరికట్టడంలో కృషి చేస్తున్నా వైయస్ జగన్ పనితనాన్ని పోల్చుతూ రాజకీయ విమర్శలు ఈ టైంలో ఎవరైనా చేస్తారా అని జనాలు మండిపడుతున్నారు.

నిజంగా చంద్రబాబుకి రాష్ట్రంపై అంత ప్రేమ ఉంటే రాష్ట్రంలో ఉండాలి, కానీ ఎక్కడో తెలంగాణలో హైదరాబాద్ లో సొంత ఇంట్లో ఉండి రాజకీయాలు చేయటం సిగ్గుచేటు అంటూ చాలా మంది విమర్శలు చేస్తున్నారు. అసలు కరోనా పరీక్షలు ఏపీ ప్రభుత్వం చేయడం లేదని దెప్పి పొడవటం, సిగ్గుచేటు అంటూ విమర్శలు చేస్తున్నారు. అనుభవం అంటూ ఎగిరిపడే చంద్రబాబు ఈ టైంలో ప్రవచనాలు సూక్తులు చెబుతూ తనని తాను తన అనుకూల మీడియా ద్వారా గొప్ప చేసుకోవడాన్ని చాలామంది విమర్శిస్తున్నారు.  ఏపీపై ప్రేమ ఉంటే వచ్చి ఇక్కడ సలహాలు సూచనలు ఈ ప్రభుత్వానికి ఇవ్వండి అంటూ కౌంటర్లు వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news