ప్రపంచాన్ని వేధిస్తున్న వెంటిలేటర్లు…!

-

కరోనా వైరస్ నుంచి ప్రజల ప్రాణాలు కాపాడాలి అంటే కచ్చితంగా వైద్య పరికరాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్య పరికరాలను ఎప్పటికప్పుడు మారుస్తూ వాటికి సాంకేతికత జోడిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ప్రపంచాన్ని వైద్య పరికరాల కొరత చాలా తీవ్రంగా వేధిస్తుంది. వైద్య రంగానికే కరోనా వైరస్ సవాల్ విసురుతుంది. దీన్ని కట్టడి చేయడం ఎవరికి సాధ్యం కావడం లేదు.

మందులు తయారు చేస్తున్నామని కట్టడి అవుతుందని చెప్పినా సరే అది కట్టడి కావడం లేదు. ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. అమెరికా, ఇటలీ, స్పెయిన్ ని ఇప్పుడు ఈ కొరత తీవ్రంగా వేధిస్తుంది. అమెరికా వైద్య రంగంలో ఉన్న డొల్లతనం ఇప్పుడే బయటపడుతుంది. ఆ దేశంలో వెంటిలేటర్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఆస్పత్రుల్లో పడకల సంఖ్య చాలా తక్కువగా ఉంది.

దీనితో రోగులను కూడా తీసుకునే పరిస్థితిలో అమెరికా లేదు. ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు వైద్య పరికరాల విషయంలో చాలా ఇబ్బందులు పడుతుంది. అందుకే ఇప్పుడు యూరప్ దేశాల్లో, అమెరికాలో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. దీనితో ఇప్పుడు ఎం చెయ్యాలో అర్ధం కావడం లేదు. ఈ పరిస్థితి గనుక కొంత కాలం కొనసాగితే మాత్రం అక్కడ మరణాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news