కరోనా వైరస్ విషయంలో ఏపీ అధికార పార్టీ నేతలు ఇప్పుడు అనవసరంగా చులకన అవుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. వాళ్ళు చేసే ప్రకటనలు వాళ్ళు మాట్లాడే మాటలపై ఇప్పుడు సొంత పార్టీలోనే అసహనం వ్యక్తం అవుతుంది. బాధ్యతగల స్థానాల్లో ఉండి కూడా అవగాహన లేకుండా కొందరు నాయకులు చేస్తున్న ప్రకటనలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అవగాహన లేకుండా మాటలు వదిలేస్తున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. మందు బిళ్ళ వేసుకుంటే తగ్గుతుంది, బ్లీచింగ్ వేస్తే చచ్చిపోతుంది అంటూ కొన్ని ప్రకటనలు చేసిన విషయం అందరికి గుర్తుంది. ఇక కరోనా వైరస్ చైనాలో కాదు కొరియా లో పుట్టింది అంటూ జగన్ కొన్ని మాటలు మాట్లాడారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సొంత పార్టీ నేతలు కూడా జగన్ ని మీడియా సమావేశం నిర్వహించావద్దు అని కోరడం గమనార్హం.
ఇక అధికారుల తీరు కూడా దాదాపు ఇదే విధంగా ఉంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి విషయంలో అవగాహన లేకుండా మాట్లాడారు అనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. మనిషికి ఒక సంఖ్య చెప్పారు డీజీపీ, సహా కొందరు అధికారులు. ఇది పక్కన పెడితే మరో వివాదం మొదలయింది. మంత్రి కొడాలి నానీ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకి వచ్చి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
చైనాలో కరోనా వైరస్ పుట్టి ప్రపంచానికి శాపంగా మారింది అంటూ కొన్ని మాటలు మాట్లాడుతూ దానికి మందు ఇంకా కనుక్కోలేదని ఆయన అన్నారు. సరే అక్కడి వరకు ఆగితే బాగానే ఉంటుంది గాని కరోనా వైరస్ కి వ్యాక్సిన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ మాట్లాడారు. అలాగే ఆయన వైరస్ ని భూస్థాపితం చేసారని కొన్ని వ్యాఖ్యలు చేసారు. దీనిపై ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తలు కూడా విమర్శలు చేస్తున్నారు.
మంత్రి అనీల్ కుమార్, ఎమ్మెల్యే రోజా, స్పీకర్ తమ్మినేని సీతారం, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి… ఎవరికి తోచిన వ్యాఖ్యలు వాళ్ళు చేస్తూ ఎవరి సందడి వాళ్ళు చేస్తున్నారు. కరోనా అనేది ఒక విపత్తు అయినా సరే ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించడం మాత్రం ఎంత వరకు కరెక్ట్ కాదు. ఇలాంటి వ్యాఖ్యలు ఎంత వరకు మంచిది కాదు. ఎన్నికలు వాయిదా వేయడంపై దాదాపు అందరూ హడావుడి చేసారు.