కరోనా వైరస్ దేశాల మధ్య వేగంగా విస్తరించడం తో దాదాపు అన్ని దేశాలు కూడా విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేసాయి. మన దేశంలో అయితే దేశీయ్ విమానాలను కూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రద్దు చేసాయి. దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు విమాన కాలుష్యం తగ్గింది అంటున్నారు. దీనిపై ఆస్ట్రేలియా కు చెందిన ఒక సంస్థ పరిశోధన చేసింది. ఎంత తగ్గింది అనే దాన్ని అంచనా వేసింది.
2019, ఫిబ్రవరి 1 నుంచి 2019 మార్చి 19తో పోల్చి చూస్తే… 2020లో ఫిబ్రవరి ఒకటి నాటికి విమానాల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు కోటి టన్నులకు పైగా తగ్గాయని తమ పరిశోధనలో వెల్లడించారు. విమాన ప్రయాణాలు నిలిచిపోవడంతో 2020లో ఎయిర్‌లైన్స్ నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు 38 శాతం తగ్గగలవని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దాదాపు అన్ని దేశాలు కూడా విమానాలను పూర్తిగా ఆపేశాయి.
కరోనా ఇలాగే పెరిగితే మాత్రం ప్రపంచంలో విమాన ప్రయాణాలు అసలు ఉండవని… కరోనా తగ్గినా సరే జనం చాలా మంది విమానాల్లో ప్రయాణించడానికి అంతగా ఆసక్తి చూపే అవకాశం ఉండదు అంటున్నారు. అయితే విమాన ప్రయాణాలకు అది ఏమీ ఉండదని కరోనా పూర్తిగా తగ్గిన నెలల వ్యవధిలో మళ్ళీ మనుషుల వ్యాపారాలు, ఉద్యోగాలు ఇలా ప్రతీ ఒక్కటి వేగం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఆస్ట్రేలియాలో విమాన ఇంధనం వాడకం 90 శాతం తగ్గిపోయింది.