క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌనే తార‌క‌మంత్ర‌మా? ఏం చేద్దాం..

-

లాక్ డౌన్ ఎన్నాళ్లు? ఇప్పుడు మ‌న దేశంలో ఏ ఇద్ద‌రు క‌లిసినా.. దీని గురించే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. నిజాని కి ప్రపంచీక‌ర‌ణ ప్ర‌బావంతో దేశాల మ‌ధ్య దూరం త‌గ్గిపోయి.. ప్ర‌జ‌ల‌కు సంబంధాలు బ‌ల‌ప‌డ్డాయి. అనేక విష‌యాల్లో ప్ర‌భుత్వాలు కూడా ప్ర‌పంచ దేశాల‌తో సంబంధాలు పెట్టుకున్నాయి. ఈ నేప‌థ్యంలో కుద‌రుగా ఒకే చోట కూర్చోవ‌డం, అది కూడా ఇంటికే ప‌రిమితం కావ‌డం వంటివి ప్ర‌స్తుత డిజిట‌ల్ ప్ర‌పంచంలో ఊహ‌కైనా అంద‌ని విష‌యం. ఇల్లు అంటే కేవ‌లం కేరాఫ్ అని చెప్పుకొన్న నాటి నుంచి ఇప్పుడు అంద‌రూ ఇంటికే ప‌రిమితం కావాల్సిన ప‌రిస్తితి ఏర్ప‌డింది.

దీంతో లాక్ డౌన్‌లో ఇంటికే ప‌రిమితం కావ‌డాన్ని నాలుగు గోడ‌ల మ‌ధ్యే న‌లిగిపోతున్న‌ట్టుగా ప్ర‌తి ఒక్క‌రూ భావిస్తున్నారు. నిజానికి గ‌తంలోనూ అనేక రోగాలు ప్ర‌పంచాన్ని కుదిపేశాయి. ప్లేగు, క‌లరా, స్వైన్ ఫ్లూ, చికెన్ గున్యా, ఎయి డ్స్ వంటి అనేక రోగాలు ప్ర‌జ‌ల‌కు, ప్ర‌బుత్వాల‌కు కూడా స‌వాలు విసిరాయి. అవి వ‌చ్చి కూడా ల‌క్ష‌ల సం ఖ్య‌లో ప్ర‌జ‌ల ప్రాణాల‌ను అప‌హ‌రించాయి. వీటిలోనూ ప్లేగు, క‌ల‌రా, స్వైన్ ఫ్లూ వంటివి అంటు రోగాలే. అయితే, అప్ప‌టికి.. ఇప్ప‌టికి మాత్రం చాలా తేడా వ‌చ్చింది. అప్పట్లో ఎవ‌రూ కూడా ఏ ప్ర‌భుత్వ‌మూ కూడా లాక్‌డౌన్ ప్ర‌క‌టించి ప్ర‌జ‌ల‌ను ఇళ్ల‌కే ప‌రిమితం చేసిన ప‌రిస్థితి క‌నిపించ‌లేదు.

కానీ, ఇప్పుడు క‌రోనా ఎఫెక్ట్‌తో దేశాల‌కు దేశాలే లాక్‌డౌన్ ప్ర‌క‌టించి ప్ర‌జ‌ల‌ను ఇళ్ల‌కు ప‌రిమితం చేస్తున్నాయి. మ‌రి ఇంత‌గా ఎందుకు ఈ మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల‌కు శిక్ష విధించింది? అనే ప్ర‌శ్న చూస్తే.. చాలా స‌మాధానాలు ఉన్నాయి. క‌రోనా అనేది అప్ప‌టిక‌ప్పుడు క‌నిపించే రోగం కాదు. అంతేకాదు, ఇది ఒక‌రి నుంచి ఒక‌రికి అత్యంత వేగంగా అంటే.. ప‌ర‌మాణు శ‌క్తిక‌న్నా.. వెయ్యిరెట్ల వేగం(ప్ర‌పంచ ఆరోగ్య సంస్థే చెప్పింది)గా విస్త‌రిస్తోంది. ఇలా అంటుతుంది. అలా అంటుతుంది.. అనే నియ‌మం కూడా ఏమీ లేదు. అందుకే మ‌నుషుల మ‌ధ్య దూరం పెర‌గాల‌ని ప్ర‌భుత్వాలు చెబుతున్నాయి.

అదే స‌మ‌యంలో తుమ్ములు, ద‌గ్గులకు కూడా దూరంగా ఉండాల‌ని చెబుతున్నాయి. లాక్ డౌన్ కొంత మేర‌కు క‌ష్ట‌మే అయినా.. ఇది త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని చండ‌శాస‌నుడిగా పేరు తెచ్చుకున్న అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కూడా ఎట్ట‌కేల‌కు ఒప్పుకొని అమెరికాలో సైన్యాన్ని పెట్టి మ‌రీ దీనిని అమ‌లు చేస్తున్నారు. సో.. లాక్‌డౌన్ ఉంటేనే క‌రోనా క‌ట్ట‌డిసాధ్య‌మ‌వుతుంద‌నే విష‌యం తెలుసుకుంటే.. అంద‌రూ సేఫ్‌!! లాక్‌డౌన్ మంచిదే.. పోయేదేమైనా ఉంటే.. క‌రోనానే!!!

Read more RELATED
Recommended to you

Latest news