షాకింగ్; చైనాలో మళ్ళీ పెరుగుతున్న కేసులు…!

-

తమను కరోనా వదిలేసింది అని భావించిన చైనాకు కరోనా ఇబ్బందులు మాత్రం వదిలే విధంగా కాపాడటం లేదు. ఒక్క కేసు కూడా నమోదు కాని స్థితి నుంచి ఇప్పుడు మళ్ళీ వందల కేసులు నాదు అయ్యే విధంగా చైనా వెళ్తుంది. ఆ దేశంలో ఇప్పుడు కేసుల సంఖ్య పెరగడం ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెడుతుంది. చైనాలో రోజు రోజుకి విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా సోకుతుంది. అక్కడ వంద మంది వరకు విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా సోకింది.

చైనాకి, రష్యాకి ఉన్న సరిహద్దుల నుంచి రష్యన్లు చైనాకి వస్తున్నారు. వారిలో చాలా మందికి కరోనా ఉంటోంది. శనివారం బయటపడిన 99 కరోనా కేసుల్లో 97 మంది విదేశాల నుంచి వచ్చిన వారే కావడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. చైనాలో ఇప్పటివరకూ విదేశాల నుంచి వచ్చిన 1280 మందికి కరోనా సోకినట్టు అధికారులు గుర్తించారు. మొత్తం కేసుల సంఖ్య 82052కి చేరుకుంది చైనాలో.

అక్కడ కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఇప్పటికే అన్ని విధాలుగా ప్రజలు సిద్దమయ్యారు. వాళ్లకు దాని సంగతి తెలుసు కాబట్టి ప్రజలకు ప్రభుత్వం సూచనలు ఉన్నా లేకపోయినా సరే అప్రమత్తంగానే ఉంటున్నారు. దీనితో మళ్ళీ అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసి వేసే ఆలోచనలో చైనా సర్కార్ ఉంది. ఇక అంతర్జాతీయ సరిహద్దులను కూడా పూర్తిగా మూసి వెయ్యాలని చూస్తుంది అక్కడి సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news