తెలంగాణా అప్రమత్తం, మళ్ళీ పెరిగిన కేసులు…!

-

తెలంగాణాలో కరోనా వైరస్ తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. కరోనా కేసులు తగ్గుతున్నాయని భావిస్తున్నా సరే అవి మాత్రం ఆగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కేసులు మాత్ర౦ ఆగడం లేదు. తాజాగా తెలంగాణాలో కరోనా కేసులు 28 బయటపడ్డాయి. కేసీఆర్ సర్కార్… దేశంలోనే మెచ్చుకునే విధంగా చర్యలు తీసుకుంటుంది. రెడ్ జోన్స్. కంటైన్మేంట్ జోన్స్ ని ప్రకటించి ప్రభుత్వం అప్రమత్తమైంది.

హైదరాబాద్ లో కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. లాక్ డౌన్ లో ఉన్నా సరే కేసులు మాత్రం బయటపడుతూనే ఉన్నాయి. కేసీఆర్ ఎంత ధైర్యం చెప్తున్నా సరే ప్రజలు మాత్రం భయపడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 16 మంది కరోనా వైరస్ తో ప్రాణం కోల్పోయారు. ఇక లాక్ డౌన్ ని కూడా పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ౦ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో లాక్ డౌన్ అమలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని,

ఏ మాత్రం అలసత్వం వద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. లాక్ డౌన్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే కష్టమని కేసీఆర్ అధికారులకు స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. చికెన్ షాపులు, ఫిష్ మార్కెట్, కిరాణా దుకాణాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు అధికారులు. వాటి కోసం ఒకరి మీద ఒకరు పడే పరిస్థితి ఉందని కాబట్టి ఇక వాటిని అవసరం అయితే మూసి వెయ్యాలని ప్రభుత్వం భావిస్తుంది. కేసులు పెరిగితే మాత్రం కట్టడి చేయడం అనేది చాలా కష్టమని ప్రభుత్వం హెచ్చరిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news