ఏపీ జోన్లు మరియు వాటి పరిమితులు…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ జోన్, రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ లు గా తీవ్రత విభజించింది. గ్రీన్ జోన్ అంటే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అని. అక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఇక రెడ్ జోన్ అంటే 15 కంటే ఎక్కువ కేసులు నమోదు అయిన ప్రాంతం, ఆరెంజ్ జోన్ అంటే 15 కంటే తక్కువ కేసులు నమోదు అయిన ప్రాంతం. అసలు ఏపీలో రెడ్ జోన్ ఏదీ ఆరెంజ్ జోన్ ఏదీ అనేది చూస్తే…

అనంతపురం జిల్లాలోని అనంతపురం, హిందూపురం, కళ్యాణ్ దుర్గం రెడ్ జోన్ గా ఉండగా… ఆరెంజ్ జోన్ గా కొత్త చెరువు ఉంది. చిత్తూరు జిల్లాలోని నగిరి, రేణిగుంట, శ్రీకాళహస్తి, తిరుపతి అర్బన్ రెడ్ జోన్… ఆరెంజ్ జోన్ గా నింద్ర, పలమనేరు, ఏర్పేడు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని శంఖవరం, కొత్త పేట రెడ్ జోన్ గా ఉండగా… అడ్డతీగల, కాకినాడ రూరల్, పెద్దాపురం, పిఠాపురం, రాజమహేంద్రవరం అర్బన్ ఆరెంజ్ జోన్ గా ఉన్నాయి.

గుంటూరు జిల్లాలో… గుంటూరు అర్బన్, మాచర్ల, అచ్చంపేట రెడ్ జోన్ కాగా చేబ్రోలు, కారంపొడిమ క్రోసూరు, మంగళగిరి, మేడికొండూరు, పొన్నూరు ఆరెంజ్ జోన్ గా ఉన్నాయి. కడప జిల్లాలో ప్రొద్దుటూరు, పులివెందుల, కడప రెడ్ జోన్ గా ప్రకటించగా… బద్వేలు, మైదుకూరు, వేంపల్లె ఆరెంజ్ జోన్ గా ఉన్నాయి. కృష్ణా జిల్లాలోని విజయవాడ అర్బన్, నూజివీడు, మచిలీపట్నం రెడ్ జోన్, జగ్గయ్యపేట, పెనమలూరు ఆరెంజ్ జోన్ గా ఉన్నాయి.

కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు, బనగానపల్లె, కోడుమూరు, కర్నూలు, నందికోట్కూరు, నంద్యాల పాణ్యం, సిరువెళ్ళ రెడ్ జోన్ గా ఉన్నాయి. బేతంచెర్ల, చాగలమర్రి, గడివేముల, గూడూరు, ఓర్వకల్లు, అవకు, ఉయ్యాలవాడ ఆరెంజ్ జోన్ గా ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో నెల్లూరు, నాయుడుపేట, వాకాడు, తడ బుచ్చిరెడ్డి పాలెం రెడ్ జోన్, ఆలూరు, బాలాయపల్లి, గూడూరు, బోగోలు, ఇందుకూరుపేట, కావలి, కోవూరు, ఓజిలి, తోటపల్లి గూడూరు ఆరెంజ్ జోన్ గా ఉన్నాయి.

ప్రకాశం జిల్లా ఒంగోలు, చీరాలా, కారంచేడు, కందుకూరు ఆరెంజ్ జోన్, కనిగిరి కొరిశపాడు, మార్కాపురం, పొదిలి రెడ్ జోన్. విశాఖ జిల్లాలో నర్సీపట్నం, పద్మనాభం, విశాఖ అర్బన్ ఆరెంజ్ జోన్ గా ఉన్నాయి. పశ్చిమ గోదావరి ఏలూరు, పెనుగొండ ఆరెంజ్ జోన్, ఆకివీడు, భీమడోలు, భీమవరం, నరసాపురం, ఉండి రెడ్ జోన్ గా ఉన్నాయి.

ఒకసారి జోన్ వారీగా అనుమతులు చూస్తే…

రెడ్ జోన్ లో టూవీలర్, ప్రైవేటు కారు, ప్రజారవాణా, సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమలు, మాల్స్, బ్యాంకులు, కార్యాలయాలు, వివాహాలు అనుమతి ఉండవు.

ఆరెంజ్ జోన్లో ఒకరికి అనుమతి ఇస్తారు టూవీలర్ మీద, ప్రైవేటు కారులో డ్రైవర్ కాకుండా మరొకరికి, ప్రజారవాణా, మాల్స్ అనుమతి ఉండవు. వ్యవసాయం రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ లో అనుమతిస్తారు. చిన్నతరహా పరిశ్రమలు స్థానిక సిబ్బందికే అనుమతిస్తారు. బాంక్ల విషయానికి వస్తే 50 శాతం మంది ఉద్యోగులు, కార్యాలయాలు 50 శాతం, వివాహాలు 10 మందికి మించకుండా అనుమతి ఉంటుంది.

గ్రీన్ జోన్ లో టూవీలర్ ఒకరికి అనుమతి, ప్రైవేటు కారులో డ్రైవర్ కాకుండా మరో ఇద్దరికీ, ప్రజారవాణా సీట్లలో 25 శాతం మించకుండా ఉండాలి. సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమలు, స్థానిక సిబ్బందికే అనుమతి, మాల్స్ దూరం తో అనుమతి… బ్యాంకులు 50 శాతం మంది ఉద్యోగులు, కార్యాలయాలు 50 శాతం, వివాహాలు 20 మందికి మించకుండా అనుమతి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news