శంకర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే యావత్ భారత దేశం మొత్తం ఎంతో ఆసక్తికిగా ఎదురుచూస్తుంటుంది. కేవలం ఫ్యాన్స్, ప్రేక్షకులే కాదు సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శక నిర్మాతలు, హీరోలు చాలా క్యూరియాటిగా ఎదురు చూస్తారు. ఈసారి ఎలాంటి సందేశం ఇస్తారా అన్న కుతూహలం ప్రతీ ఒక్కరిలోను ఉంటుంది. ఇక ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో ..’ఇండియన్ 2′ సినిమా రూపుందున్న సంగతి తెలిసిందే. రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తమిళం, హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది.
దాదాపు 22 ఏళ్ల తర్వాత మళ్ళీ కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘భారతీయుడు 2’ సినిమాపై తమిళ ఇండస్ట్రీతో పాటు మిగతా సినీ ఇండస్ట్రీలో భారీగా ఆసక్తి నెలకొంది. అందుకు కారణం ఈ సినిమాతో కొత్త రికార్డ్ లు నెలకొల్పాలన్న కసితో కమల్ హాసన్ శంకర్ ఉండటమే. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి అవాంతరాలు వెంటాడుతున్నాయి. ‘ఇండియన్ 2’ రెగ్యులర్ షూటింగ్ మొదలైన తర్వాత మధ్యలో ఆగిపోయిందన్న వార్తలు వచ్చాయి.
అయితే ‘ఇండియన్ 2’ ఆగిపోలేదని కమల్ హాసన్ శంకర్ ఇద్దరు క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమా తర్వాత ‘క్షత్రియ పుత్రుడు’, ‘శభాష్ నాయుడు’ సినిమాలు కూడా పూర్తి చేస్తానని కమల్ హాసన్ వెల్లడించారు. ఇదే సినిమాని ‘భారతీయుడు 2’ గాను తెలుగులో రిలీజ్ చేస్తుండగా కమల్ హాసన్‌కు జోడిగా కాజల్ నటిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, శింబు, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారని సమాచారం. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి అనిరుథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా సెట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారని వార్తలు వచ్చాయి. దాంతో ఈ సినిమా షూటింగ్ ని ఆపేశారు. ఇదే ఒక పెద్ద దెబ్బ అయితే ఇప్పుడు ఈ సినిమా కి కరోనా కష్టాలు మామూలుగా లేవు. దీంతో ఈ సినిమా ఉంటుందా పూర్తిగా క్యాన్సిల్ అవుతుందా అన్న సందేహాలు కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.