సాధారణంగా కారు ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా మనం ఎన్నో కారు వీడియోలను చూస్తూ ఉంటాం. కొన్ని కొన్ని వీడియోలు మాత్రం మనకు అలా గుర్తుండిపోతు ఉంటాయి. తాజాగా జరిగిన ఒక కారు ప్రమాదం చూస్తే గుండె జల్లుమంటుంది. వీడియో చూసి భయపడే పరిస్థితి ఉంటుంది. పోలాండ్ లో ఒక సుజుకి స్విఫ్ట్ కారు ప్రమాదానికి సంబంధించిన వీడియో ని పోలీసులు విడుదల చేసారు.
ఈ వీడియోలో కారు వేగంగా వస్తుంది ఖాళీ రోడ్డు మీద. అయితే అక్కడ రింగ్ ఉంటుంది. ఈ రింగ్ ని గమించని… డ్రైవర్ వేగంగా వచ్చి డీ కొడుతుంది. అంతే గాల్లోకి ఊహించని వేగంగా ఎగురుతుంది కారు. డైలీ మెయిల్ కధనం ఆధారంగా చూస్తే రాబియన్ అనే గ్రామంలోని ఒక స్మశాన వాటిక వద్ద ఇది జరిగింది. అదే వేగంతో గాల్లోకి వెళ్లి భవనాలకు తగులుతుంది. ఆ వేగానికి మంటలు చెలరేగాయి.
41 ఏళ్ళ డ్రైవర్ ని అగ్నిమాపక సిబ్బంది చాలా జాగ్రత్తగా కారుని కత్తిరించి తీసారు బయటకు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ సంఘటన గత ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరిగగా కారు పూర్తిగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ, డ్రైవర్ ప్రాణాల నుంచి బయటపడ్డాడు. డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ మత్తులో ఉన్నాడా అని పోలీసులు ఇప్పుడు రక్త పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. భారీ ఆస్తి నష్టం కూడా జరిగిందని గుర్తించారు అధికారులు.