క్వారంటైన్ లో ఒక్క రోజుకి ఎంత ఖర్చు అంటే…!

-

దేశ వ్యాప్తంగా కరోన కేసులు పెరుగుతున్న తరుణంలో క్వారంటైన్ లో ఉండే వాళ్ళు కూడా క్రమంగా పెరుగుతున్నారు. ఒక్కరికి కరోనా వచ్చింది అంటే ఆ వ్యక్తితో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరిని క్వారంటైన్ చేస్తున్నారు. దీని వలన ప్రభుత్వాలకు ఖర్చు కూడా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. రాజస్థాన్ లో కరోనా కేసులు రెండు వేలకు చేరువలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో క్వారంటైన్ లో ఉన్న వాళ్లకు,

రోగులకు ఎంత ఖర్చు చెయ్యాలి అనే దాని మీద రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఒక రోగికి ఒక రోజుకు గ‌రిష్టంగా రూ.2,440 రూపాయ‌ల‌ను ఖర్చు చెయ్యాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆహారం, పానీయాల కోసం రూ .600 వరకు ఖర్చు చేస్తారు. అదే విధంగా అల్పాహారం మీద రూ .100, భోజనం మరియు విందుకు రూ. 180 వరకు ఖర్చు చేస్తారు. అదే విధంగా నీటిపై రూ .80, టీ, స్నాక్స్ కోసం కేటాయిస్తారు.

లినైన్‌, లాండ్రీపై రూ.60ను ఖ‌ర్చు చెయ్యాలి. రూ.550ను క్లీనింగ్‌, డిసిన్ఫెక్షన్‌కు కోసం నిధులు కేటాయించారు. రూ.500ను క్వారంటైన్‌లోని స్టాఫ్ ఆహారం కోసం కేట‌యించింది ప్రభుత్వం. హెల్త్ వ‌ర్కర్ల పీపీఈ కోసం రూ.600ను ఖ‌ర్చు చేస్తారు. రూ.100 స్ప్రేయింగ్ మిష‌న్ కోసం ఖర్చు చేస్తారు. రూ.30ను గార్డ్ కోసం ఖ‌ర్చు చేస్తారు. అక్కడ 27 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news