మధుర మీనాక్షి ఆలయ విశేషాలు…!

-

మనదేశంలో అత్యంత శక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ,పంచా రామాలు ఇలా చెప్పుకుంటూ పోతే లెక్క లేనన్ని అత్యంత ప్రసిద్ధి చెందినా దేవాలయాలు ఉన్నాయి. భక్తుల కోరికలు తీర్చే బోళా శంకరుడు, భక్తులను రక్షించే ఆదిశక్తి అమ్మ వార్ల ఆలయాలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ప్రత్యేకించి ఇక్కడ అమ్మవారి గురించి మాత్రం తెలుసుకోవాలి. ఆ అమ్మవారు మమతల తల్లిగా పేరుగాంచింది. ప్రసిద్ధి చెందిన శక్తి పీఠాలలో ఒకటైన అతి ప్రాచీనమైన ఆలయం మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం .

తమిళనాడులోని చెన్నైకి 400 కి.మి దూరంలో వేగాయి నది ఒడ్డున మదురై పట్టణం ఉంది. మీనాక్షి ఆలయం ఆ నది ఒడ్డున ఉంది. 2500 ఏళ్ళ క్రితమే మీనాక్షి, సుందరేశ్వర్ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెపుతుంది. ఈ ఆలయం ఆ కాలపు జీవన విధానాన్ని తెలుపుతుంది. . ఈ ఆలయంలో ప్రధాన దేవతగా మీనాక్షి అమ్మవారు కొలువై ఉంటుంది. ఈ దేవాలయం అద్భుతమైన శిల్ప, చిత్ర కళా రీతులతో తమిళ సంస్కృతికి చిహ్నంగా ఉంటుంది. మదురై పాలకుడు మలయ ధ్వజ పాండ్య రాజు చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతి దేవి చిన్న పాప రూపంలో భూమ్మీద వెలిసింది.

ఆమెను పరిణయ మాడడానికి సుందరేశ్వరుడుగా శివుడు వస్తాడు. వీరి కల్యాణాన్ని పవలాక నైవాల్ పెరుమాళ్ జరిపిస్తాడు. అందుకే ప్రతి సంవత్సరం ఏప్రిల్ లో మీనాక్షి తిరు కల్యాణం ముఖ్యమైన పండుగలా నిర్వహిస్తారు. ఈ ఆలయం 15 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ మొత్తం 16 గోపురాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని 13 వ శతాబ్దంలో నిర్మించినట్టు శాసనాలు చెపుతున్నాయి. తరువాత జరిగిన దండ యాత్రల్లో గుడిని గుడికి సంబంధించిన ఆనవాళ్లన్ని ద్వంస మైయ్యాయి. తిరిగి ఆలయాన్ని 16 వ శతాబ్దంలో పునర్నిర్మించారు. ఇక్కడ నవరాత్రి, శివ రాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news