కరోనా వైరస్ ని ఎదుర్కోవాలి అంటే ప్రతీ ఒక్కరి సహకారం అనేది అవసరం. అందరూ తలో చేయి వేస్తేనే దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే కరోనా పై పోరాటం విషయంలో భారత ప్రజారోగ్య వ్యవస్థకు పునాదులుగా చెప్పుకునే ఎన్జీవోలు మాత్రం ముందుకు రావడం లేదు. గతంలో మలేరియా సహా ఏ వ్యాధి వచ్చినా సరే మేము ఉన్నాం అంటూ ముందుకి వచ్చిన ఎన్జీవో సంస్థలు ఇప్పుడు ముందుకు వచ్చే ప్రయత్నం చేయడం లేదు.
కరోనా ఈ స్థాయిలో ఉన్నా సరే ఎన్జీవో సంస్థలు మాత్రం మేము ఉన్నాం అని ముందుకి రావడం లేదు. ఇటీవల నీతి అయోగ్ కూడా వాళ్ళు ముందుకి రావాలని కోరింది. ఢిల్లీలోని ‘ఎంసీకేఎస్ ఫుడ్ ఫర్ ది అంగ్రీ ఫౌండేషన్’, సాఫా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ‘యూత్ ఫీడ్ ఇండియా ప్రోగ్రామ్’, ‘శరణార్థి సేవ’ లాంటి సంస్థలు కేవలం అన్నదాన కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అయ్యాయి.
2017లో ఎన్జీవో సంస్థలకు అందుతున్న విదేశీ విరాళాలను నియంత్రించడానికి గానూ మోడీ సర్కార్… ‘ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్’ను తీసుకొచ్చింది. దీనితో 20 వేల వరకు ఎన్జీవో సంస్థల లైసెన్స్ లు రద్దు కావడంతో వాళ్ళు వెనక్కు తగ్గుతున్నారు. ఎన్జీవో సంస్థలకు భారీ విరాళాలను కొలరాడో కేంద్రంగా పని చేస్తోన్న ‘క్రిస్టియన్ చారిటీ కంపాషన్ ఇంటర్నేషనల్’ ఇస్తుంది. ఏటా 45 మిలియన్ డాలర్లు ఇస్తూ ఉంటుంది.