నిధి అగర్వాల్ లిస్ట్ లో ఎన్ని సినిమాలో …?

-

ఇస్మార్ట్ శంకర్ తో స్టార్ తిరిగిపోతుందనుకున్న బ్యూటి ఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ కి షాకే తగిలింది. ఈ సినిమా తర్వాత అద్భుతం జరుగుతుందనుకుంటే పట్టించుకున్న వాళ్ళే కరువయ్యారు. నిధి అగర్వాల్ కి అందం అభినయం ఉన్నా గాని ఎందుకనో అవకాశాలు రావడం లేదు. ముంబై నుండి రావడం రావడమే రెండు సినిమాలు వరసగా అక్కినేని సోదరులు నాగ చైతన్య, అఖిల్ తో చేసింది. సవ్యసాచి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమవుతూ నాగ చైతన్య తో నటించింది. ఆ తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ఞు చేసింది. ఈ రెండు సినిమా కథలు కొత్తగా ఉన్నప్పటికి ఫ్లాపవడం వల్ల నిధి ఇండస్ట్రీ దృష్ఠిని ఆకట్టుకోలేకపోయింది.

అయితే పూరి జగన్నాధ్ ఇచ్చిన గోల్డెన్ ఛాన్స్ తో నిధి అగర్వాల్ లైఫ్ పీక్స్ కి వెళుతుందని భావించింది. ఇస్మార్ట్ శంకర్ లో నటించిన ఈ బ్యూటికి మంచి హిట్ దక్కింది. అంతేకాదు ఈ సినిమా సక్సస్ టాక్ రాగానే నిధి పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. దాంతో ఈ అమ్మడికి వరసగా సినిమాలు వస్తాయనుకున్నారు. అన్నట్టుగానే చాలా నిర్మాణ సంస్థలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ పేరును పరిశీలించాయి కూడా.

కాని ఎందుకనో ఒక్క పెద్ద నిర్మాణ సంస్థలోను ఇప్పటికి ఛాన్స్ రాలేదు. అదే ఇపుడు నిధి అగర్వాల్ డైలమాలో పడిందట. చెప్పుకోవడానికి సోషల్ మీడియాలో చాలా సినిమాలలో నటిస్తున్నట్టు పేరు వాడుతున్నారు. కాని అఫీషియల్ గా మాత్రం ఒక్క సినిమాలో అవకాశం లేదని ఫీలవుతుందట. అందుకు కారణం మరోసారి నిధి అగర్వాల్ పేరు తెరమీదకి రావడమే. పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందన్న వార్త మళ్ళీ చక్కర్లు కొడుతోంది. రాం చరణ్ సినిమా, సాయి ధరం తేజ్ సినిమా, వరుణ్ తేజ్ సినిమా, రవితేజ సినిమా ..ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఇలా లిస్ట్ మాత్రం పెద్దగానే ఉన్నప్పటికి అఫీషియల్ గా మాత్రం కేవలం ఒక్క గల్లా అశోక్ సినిమా మాత్రమే చేస్తుంది. మిగతావన్ని ప్రస్తుతానికి రూమర్సేనట.

Read more RELATED
Recommended to you

Latest news