ఉగ్రవాదుల డెన్, కుక్కలు కాపలా…!

-

కరోనా వైరస్ ఉన్నా సరే కాశ్మీర్ లో ఉగ్రవాదులు మాత్రం తమ కార్యాకలాపాలను అసలు ఏ మాత్రం కూడా ఆపే ప్రయత్నం చేయడం లేదు. ఇష్టం వచ్చినట్టు చొరబాట్లకు పాల్పడుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ సహాయం తో వాళ్ళు సరిహద్దుల్లో చెలరేగిపోతున్నారు. అయితే నిఘా వర్గాల పక్కా సమాచారంతో భారత ఆర్మీ వారికి చుక్కలు చూపిస్తుంది. గత పది రోజుల్లో దాదాపు 20 మంది ఉగ్రవాదులను చంపింది.

ప్రతీ రోజు కూడా ఎవరో ఒకరిని హతమారుస్తునే ఉంది. అడవుల్లో నక్కి భారత సైన్యం మీద దాడులకు తెగబడుతున్నారు ఉగ్రవాదులు. ఈ రోజు ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు కాల్చి చంపాయి. ఈ సందర్భంగా గాలింపు చేపట్టగా ఉగ్రవాదుల అండర్ గ్రౌండ్ డెన్ ని గుర్తించారు. పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ డెన్ ని ఆర్మీ అధికారులు గుర్తించారు. భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

గాలి లోపలి వచ్చే విధంగా డెన్ ని నిర్మించుకున్న ఉగ్రవాదులు, అక్కడ కుక్కలను కాపలా పెట్టుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉంటే గుర్తించే అవకాశం ఉందని భావించి కొన్ని కుక్కలను వాడుకుంటున్నారు. ఎవరు లేని సమయంలో వాటికి ఆహారం అందించడం వంటివి చేస్తున్నారు. దీనిపై ఇప్పుడు భారత ఆర్మీ అప్రమత్తమైంది. సరిహద్దుల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్న ఆర్మీ అధికారులు డెన్ లో ఏమైనా ఆధారాలు ఉంటాయా అనే దాని మీద ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news