ఈ కరోనా కాలంలో ఏసీ టెంపరేచర్‌ ఎంత ఉండాలి..?

-

ప్రస్తుత కరోనా సమయంలో ఇళ్లు, ఆఫీసుల్లో ఉండాల్సిన ఏసీ ఉష్ణోగ్రతలపై ఇండియన్ సొసైటీ ఆఫ్‌ హీటింగ్‌ రిఫ్రిజిరేటింగ్‌ అండ్‌ ఎయిర్‌కండిషనర్‌ ఇంజనీర్స్‌ ( ISHRAE ) మార్గదర్శకాలను రూపొందించింది.

ఇండ్లు, ఆఫీసుల్లో ఉండే ఏసీ ఉష్ణోగ్రత 24 నుండి 30 డిగ్రీల సెల్సియస్‌ మాత్రమే ఉండాలని నేడు కేంద్రం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఒక నోట్‌ విడుదల చేసిన కేంద్రం, గాలిలో తేమ శాతం 40 నుండి 70 మధ్య ఉండాలని సూచించింది.

ఇండియన్ సొసైటీ ఆఫ్‌ హీటింగ్‌ రిఫ్రిజిరేటింగ్‌ అండ్‌ ఎయిర్‌కండిషనర్‌ ఇంజనీర్స్‌ ( ISHRAE )రూపొందించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వ ప్రజా పనుల శాఖ విడుదల చేసింది.  ఈ మార్గదర్శక పత్రాన్ని రూపొందించే పనిలో శాస్త్రవేత్తలు, వైజ్ఞానికులు, తయారీరంగ నిపుణులు, డిజైనర్లు, వాయునాణ్యత, ఆరోగ్య సంరక్షణ నిపుణులు పాల్గొన్నారు. ఇదంతా భారత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తయారుచేసిందిగా కేంద్రం తెలిపింది.

గదిలో చల్లని గాలి తిరుగుతున్నప్పుడు కిటికీ తలుపులు కొంచెం తెరిచి తెరిచిఉంచి, బయటి గాలిని లోనికి వచ్చేలా చేయడం మంచిదని ఆ పత్రం సలహ ఇచ్చింది. పొడి వాతావరణంలో గాలిలో తేమను 40 శాతానికి తగ్గకుండా చూడాలని, ఒకవేళ తగ్గినట్లుగా అనిపిస్తే, ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి, గదిలో పెట్టాలని, అది తేమను పెంచుతుందని ఆ ప్రకటన తెలిపింది.

ఇంట్లోని అన్ని గదుల్లో వెంటిలేషన్ బాగా ఉండేట్టు చూసుకోవాలని, ఫ్యాన్లు నడుస్తున్నప్పుడు కూడా కిటికీలు కొద్దిగా తెరవడం, ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ వేయడం లాంటివి చేయాలని ఆ ప్రకటన తెలిపింది. లాక్‌డౌన్‌ కాలంలో చాలా పరికరాలను ఆన్‌ చేయకపోవడం వల్ల ఫంగస్‌, వాల్వ్‌లు మూసుకుపోవడం, పైపులు జామ్‌ అవడం, తుప్పు పట్టడం లాంటివి జరిగి పనిచేయకుండా పోయే అవకాశం ఉంది. ముందుగా నిపుణులైన టెక్నీషియన్లతో మెయిన్‌టెనెన్స్‌ చేయించిన తర్వాతే దేన్నయినా ఆన్‌ చేయాలని ఆ మార్గదర్శకాలు స్పష్టం చేసాయి. (మరింత చదవండి : ఏసీ, కూలర్ వాడుతున్నారా…? కేంద్రం చేసిన సూచనలు ఇవే…! )

Read more RELATED
Recommended to you

Latest news