మా ఆయన కోసం వచ్చా; మహిళ షాకింగ్ సమాధానం…!

-

దేశ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు మొదలయ్యాయి. ఇన్నాళ్ళుగా మద్యం లేక ఇబ్బందులు పడిన జనాలు అందరూ కూడా ఇప్పుడు మద్యం కోసం బారులు తీరారు. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మద్యం కోసం బారులు తీరిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. ప్రకాశం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో మహిళలు కనపడ్డారు. ఈ నేపధ్యంలో మీడియా వారిని పలకరించింది. ఈ సందర్భంగా ఒక మహిళ మాట్లాడుతూ…

తన భర్తకు మద్యం లేదని, దీనితో ఆయన ఇబ్బంది పడుతున్నారని, అయితే ఇంత మంది లైన్ లో ఉంటే మగాళ్ళకు ఇవ్వడం కష్టం కాబట్టి తాను వచ్చా అని ఆమె చెప్పింది. దీనితో అక్కడ ఉన్న అధికారులు కూడా షాక్ అయ్యారు. బెంగళూరు లో కొంత మంది అమ్మాయిలూ తమ బాయ్ ఫ్రెండ్స్ కోసం, తమ్ముళ్ళు అన్నల కోసం వచ్చి బారులు తీరారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

యుట్యూబ్ చానల్స్ కూడా వీరి మీద దృష్టి పెట్టడంతో ఆ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఏబెంగళూరులో అమ్మాయిలు పొట్టి పొట్టి డ్రెస్ లు వేసుకుని మద్యం కోసం ఎగబడ్డారు. పీలో మద్యం అమ్మకాలు దాదాపు 60 కోట్ల వరకు జరిగాయని సమాచారం. తెలంగాణాలో ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది స్పష్టత లేదు.

Read more RELATED
Recommended to you

Latest news