మహారాష్ట్ర ఔరంగాబాద్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. 14 మంది వలస కూలీలు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ట్రాక్ పై నిద్రిస్తున్న వలస కూలీల మీద నుంచి రైలు వెళ్ళడంతో ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు ఈ ప్రమాదానికి కారణం అయింది. ఉదయం 6;30 నిమిషాలకు ఔరంగాబాద్ జల్నా మధ్య ఈ ఘటన జరిగింది అని తెలుస్తుంది. ఈ ఘటనలో కొంత మందికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి.
అయితే మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే వలస కూలీలు అక్కడ ఎందుకు నిద్రించారు అనేది స్పష్టత లేదు. వలస కూలీలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి రైల్వే స్టేషన్ కి వచ్చారు అని, అయితే అక్కడ ట్రాక్ ఖాళీ గా ఉండటంతో వాళ్ళు నిద్రించారు అని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైల్వే యంత్రాంగం అప్రమత్త౦ అయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.