జగన్ మాట తప్పలేదు… అన్ని పక్షాలూ ఒప్పుకుంటున్నాయిగా!

-

చాలా మంది రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లక్ష చెబుతారు! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు… అధికారంలో ఉన్నది తాము కాదు కదా అని జనాలకు అది చెయ్యొచ్చు కదా.. జనాలకు ఇది చెయ్యొచ్చు కదా అని తెగ ప్రేమ కురిపించేస్తుంటారు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలు వేరేలా ఉంటాయి! కాని ఆ విషయాలు చాలా మంది నేతలకు నప్పుతుంది కానీ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కాదని నిరూపించారు వైఎస్ జగన్! ఇది వైకాపా నేతలో, జగన్ సానుభూతిపరులో ఒప్పుకొన్న మాటకాదు సుమా… అన్ని వర్గాలు, అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకున్న మాట, మెచ్చుకుంటున్న మాట!

అది సుమారుగా 6 సంవత్సరాల క్రితం సంగతి! 2014 జూన్‌ నెల… ఆ సమయంలో తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్‌ పైప్‌ లైన్‌ పేలి పలువురు మృత్యువాతపడ్డారు. ఈ సమయంలో నాటి ప్రభుత్వం రూ. 25లక్షలు పరిహారం ప్రకటించింది! ఈ విషయాలపై నాడు ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్… ప్రమాదం జరిగిన ప్రాంతంలో పర్యటించి, దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం ఎంతమాత్రం సరిపోదని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఓఎన్జీసీకి కానీ, గెయిల్‌ కు కానీ ఒంట్లో భయం పుట్టాలంటే కనీసం కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సరిగ్గా ఆరు సంవత్సరాలు గడిచింది… ఇప్పుడు అనుకోకుండా వైజాగ్ లో గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగింది. ఈ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దుర్ఘటనపై వెను వెంటనే స్పందించారు.. బాధితులను పరామర్శించి, మృతుల కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. కేవలం మృతులకే కాకుండా… వెంటిలేటర్‌ పై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు, బాధిత గ్రామాల్లోని 15 వేలమందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు, జంతు నష్టం జరిగిన వారికి ఒక్కో జంతువుకు రూ.25 వేల నష్టపరిహారం, ఎల్జీ కంపెనీలో బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ స్పందన న భూతో న భవిష్యత్ అని అన్ని వర్గాలు అనడం ఇక్కడ గమనార్హం!

ఈ విషయాలపై స్పందించిన బీజేపీ నాయకుడు విష్ణుకుమార్‌ రాజు… రాష్ట్రంలో, దేశంలో ఎన్నో భారీ విపత్తులు చూశాం.. కానీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా బాధితులకు సీఎం వైఎస్‌ జగన్‌ పరిహారం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్‌ యంత్రాంగం స్పందించిన తీరు, తీసుకున్న చర్యలు అద్భుతం అంటుండగా…. మేం ఊహించిన దానికన్నా నాలుగు రెట్లు ఎక్కువ సా యాన్ని ప్రక టించిన సీఎం వైఎస్‌ జగన్‌ అభినందనీ యులు. బాధితు లను, బాధిత గ్రామాల ప్రజలకు కూడా ఆర్థిక సాయాన్ని ప్రకటించి ఆదుకున్న తీరు ప్రశంసనీయం అంటూ అభినందిస్తున్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి.. నారాయణ! ఇదే సమయంలో… బాధితులకు నష్టపరిహారాన్ని ప్రకటించి సీఎం వైఎస్‌ జగన్‌ వారిని ఆదుకున్న తీరు హర్షణీయం అంటూ ప్రకటించారు వామపక్ష నేతలు అయిన కె. రామకృష్ణ, పి. మధు!

ఇలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ, అధికారం చేపట్టాక కూడా ఒకే మాటపై నిలబడటం ఎంతమంది నాయకులకు సాధ్యం అని, అలా మాటపై నిలబడేవారు ఎంతమంది ఉంటారాని… జగన్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి!

Read more RELATED
Recommended to you

Latest news