జనసేన అధినేత బిజెపి తో పొత్తు పెట్టుకోవడం ఏమో గాని ఆయన ఆ అడుగు వేసినప్పటి నుంచి రాజకీయాల్లో వెనక్కు తగ్గారు అనేది అర్ధమవుతుంది. ఆయన చాలా వరకు దూరంగానే ఉంటున్నారు. ఎప్పుడో మినహా ఆయన మాట్లాడటం లేదు. కాని ఏపీ ప్రభుత్వాన్ని మాత్రం ఆయన టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఏపీ సర్కార్ మీద విమర్శలు చేయడం ద్వారా పరోక్షంగా అటు తెలుగుదేశం పార్టీకి కూడా సహకారం అందిస్తున్నారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండే ఆలోచనలో ఉన్నారని సమాచారం
రాజకీయాల గురించి తనకు అంత అవగాహన లేకపోయినా సరే కొందరి సహకారం తో పవన్ పార్టీ పెట్టారు అనే వ్యాఖ్యలు ఎప్పటి నుంచో వినపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఆయన పార్టీని దాదాపుగా బిజెపిలో విలీనం చేసినట్టే అనే విషయం అర్ధమవుతుంది. ఇప్పుడు జనసేన మీద పెత్తనం మొత్తం దాదాపుగా బిజెపికే ఉందని జనసేన నాయకులను కూడా ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ డైరెక్ట్ చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పవన్ జనసేన నేతలతో స్వయంగా మాట్లాడి చాలా రోజులు అయింది.
అందుకే ఇప్పుడు పవన్ ని కూడా జనసేన నేతలు పెద్దగా పట్టించుకునే సాహసం చేయడం లేదని, ఏది అయినా మాట్లాడాలి అనుకున్నా సరే స్థానిక బిజెపి నేతలతో మాట్లాడి ముందుకు వెళ్తున్నారు అని మీడియాలో కూడా ఎక్కువగా బిజెపి మాత్రమే హైలెట్ అవుతుంది కాబట్టి ఆ పార్టీ తో ముందుకు వెళ్ళడమే మంచిది అని భవిష్యత్తులో బిజెపి టీడీపీ తో కలిసే అవకాశాలు ఉన్నాయని.. ఇప్పటి నుంచి బిజెపి తో సన్నిహితంగా ఉంటే తమకు ఏదోక మేలు జరుగుతుంది అని జనసేన నేతలు భావిస్తున్నారు.