ఆవులను పెంచుతున్నారా..? అయితే ఒకే ఒక్క గిర్ ఆవుని తీసుకోండి.. ఇరవై లీటర్ల పాలుని పొందొచ్చు..!

-

రైతుల కేవలం పంటలు పండించడం మాత్రమే కాకుండా పశువులను కూడా పెంచుతూ ఉంటారు. పశువులను పెంచడం వల్ల మరి కొంచెం డబ్బులు వస్తాయి. కేవలం పంటల మీద మాత్రమే ఆధారపడకుండా పశువుల్ని పెంచి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. అందుకే చాలా మంది రైతులు మేకల్ని కానీ ఆవులను కానీ గేదెలను కానీ పెంచుతూ ఉంటారు.

చాలా మంది రైతులు ఆవులను కూడా పెంచుతూ ఉంటారు. అయితే ఆవుల పెంపకం లో రైతులు ఏ విధంగా ఫాలో అయితే మంచిగా డబ్బులు వస్తాయి..?, ఎక్కువ రాబడి ని ఎలా పొందవచ్చు అనే వాటి కోసం ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్కువగా గిర్ ఆవులని పెంచడం వల్ల డబ్బులు బాగా వస్తాయి. అయితే మనం ఆవుల్ని మేపి వాటి కోసం గ్రాసం వేసి అదే విధంగా వైద్యం చేయించి ఇలా ఎక్కువ ఖర్చు చేసి తక్కువ ధరకే పాలు అమ్మితే నష్టం వస్తుంది. అందుకని ఎక్కువ పాలు ఇచ్చే ఆవులను పెంచితే కాస్త రాబడి ఎక్కువ వస్తుంది.

నిజానికి ఈ ఆవుల పాల వ్యాపారం చేస్తే కోటీశ్వరులు కూడా అయిపోవచ్చు. అయితే ఈ ఆవుల్ని పెంచడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. పాల ఉత్పత్తి మాత్రం ఎక్కువ ఉంటుంది. దీంతో లాభాలు కూడా బాగా వస్తాయి.

ఈ ఆవులు ఎక్కడ లభిస్తాయి..?

ఈ జాతి ఆవులు రాజస్థాన్ లోని అజ్మీర్, హర్యానాలో పెంచుతారు. ఈ మధ్య కాలంలో వీటికి డిమాండ్ ఎక్కువ పెరిగింది. ఒక ఆవు 12 నుంచి 15 ఏళ్ళు బతుకుతుంది. వీటికి 6 నుంచి 12 పిల్లలు పుడతాయి.

ఎన్ని పాలు ఇస్తుంది..?

గిర్ జాతి ఆవులు రోజుకి 12 నుండి 20 లీటర్ల పాలు ఇస్తుంది. అయితే పెంపకాన్ని బట్టి పాల ఉత్పత్తి ఉంటుంది. ఆవుల కి సరైన దాణా పెట్టాల్సి ఉంటుంది. అలానే వీటి యొక్క గొడ్ల చావడిను కూడా చక్కగా మెయింటెయిన్ చేసుకుంటూ రావాలి.

ఆవు ధర ఎంత ఉంటుంది..?

ఆవు వయసు దాని యొక్క ప్రెగ్నెన్సీ వీటి ఆధారంగా ధర ఉంటుంది ఒక ఆవు ధర లక్ష నుంచి రెండు లక్షల వరకు ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news