పాడి పంటలు: డైరీ బిజినెస్ కు బెస్ట్ ఛాయిస్ ముర్రా జాతి గేదెలు

-

వ్యవసాయంలో సంప్రదాయక పంటలే కాకుండా… పాడి రంగానికి కీలక స్థానం ఉంది. అయితే వ్యవసాయం చేసినంతగా పాడి రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. డైరీ, మేకలు, ఫౌల్ట్రీ, రొయ్యలు, చేపల పెంపకం అనుకున్నంతగా పెరగడం లేదు. ఈరంగంలో అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకుంటే.. ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

 

ముఖ్యంగా డైరీ బిజినెస్ లాభదాయకంగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో అన్ని రెడీమేడ్ గా మారిపోయాయి. గతంలో గ్రామాల్లో ప్రతీ ఇంటికి గేదెలు, ఆవులు, కోళ్లు ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. గ్రామాలకు కూడా పాకెట్ పాలు దర్శనం ఇస్తున్నాయి. దీంతో డైరీ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగ యువత డైరీ బిజినెస్ పై ద్రుష్టి సారిస్తే చాలా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది డైరీ బిజినెస్ లో సక్సెస్ అయ్యారు.

డైరీ పెట్టడం చాలా మంది రిస్క్ తో కూడుకున్న వ్యవహారంగా భావిస్తారు. ఈ రంగంలోకి అడుగుపెట్టే ముందు సమాజం నుంచి వ్యతిరేఖత వస్తుంది. అయితే ఒక్కసారి మనం సక్సెస్ అయితే.. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. లాభాలను గడించ వచ్చు

డైరీకి బెస్ట్ ఛాయిస్ ముర్రాజాతి గేదెలు:

డైరీ ఫామ్ పెట్టే ముందు మనం ఏ రకం గేదెలను, ఆవులను ఎన్నుకుంటున్నామనేది చాలా కీలకం. అయితే ఎక్కువ మంది గేదెల ఫామ్ పెట్టేందుకే మొగ్గు చూపిస్తుంటారు. ఆవులతో పోలిస్తే గేదెలు ఏ వాతావరణంలో అయినా తట్టుకునే శక్తి ఉంటుంది. దీంతో పాటు ఏ రకం గేదెలను ఎన్నుకుంటున్నామనేది కూడా చాలా ముఖ్యం. మేలు జాతి పశువుల ఎంపిక చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం ముర్రాజాతి గేదెలతో పాట దిగుబడి ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు గౌడి బర్రెలు కూడా ఎక్కువగా పాలు ఇస్తుంటాయి. హర్యానా నుంచి గేదెలను తీసుకువచ్చి.. తెలుగు రాష్ట్రాల్లో పెంచుతున్నారు. ముర్రా జాతి గేదెలు రోజుకు సగటున 18-20 లీటర్లు ఉండటంతో పాటు.. వెన్నశాతం 7 శాతం వరకు ఉంటుంది.

హర్యానలోని రోహ్ తక్, హిస్సార్ ప్రాంతాల్లో ముర్రా జాతి గేదెలు లభిస్తుంటాయి. వీటిలో కూడా బాహ్య లక్షణాలను పరిగణలోకి తీసుకుని రైతులు ఎంచుకోవాలి. వీటి బరువు 500 -700 కిలోల వరకు ఉండటంతో పాటు.. చర్మం కాటుక నలుపు ఉండాలి. వీటి కొమ్ములు ఒంపు తిరిగి ఉండాలి. తల పెద్దగా.. శవపేటిక ఆకారంలో ఉండాలి, వెనకభాగం వెడల్పుగా ఉండాలి. రెండు కాళ్ల మధ్యలో పొదుగు ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఉన్న ముర్రా జాతి గేదెలను ఎంపిక చేసుకోవాలి.

రైతులు ఎంపిక చేసుకునే ముందు సూటి పశువులను కొనరాదు. ఒకటి, రెండో ఈత గేదె పశువులను ఎంపిక చేసుకోవాలి. హర్యానాలో ఏ మేత పెట్టారో.. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడే వరకు అదే ఆహారాన్న ఇవ్వాలి. ఇలా అయితే డైరీని సక్సెస్ గా రన్ చేసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news