నాటు కోళ్ళలో… బాహ్య, అంతర పరాన్న జీవుల నివారణకు జాగ్రత్తలు

ఊర్లలో పశువులతో పాటు.. కోళ్లను పెంచడం కూడా చాలామందకి అలవాటు ఉంటుంది. ఆ పశువులు మేతలోనే కోళ్లు తింటుంటాయి. ఇంకా నాటుకోళ్ల పెంపకం ద్వారా గుడ్లు, మంచి మాంసం కూడా లభిస్తుంది. మార్కెట్‌లో బ్రాయిలర్‌ కోళ్ళ కంటే నాటుకోళ్ళ మాంసానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో వీటి పెంపకంపై, ఆరోగ్యంపై అవగాహన తక్కువ. నాటుకోళ్ళ పెంపకంపై శ్రద్ధ లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు.

నాటుకోళ్ళకు ఇంటి పరిసరాలు, పొలాల్లోన్ని గింజలు, పురుగుల్ని ఏరుకుని తింటాయి. కలుషితమైన నీరు తాగుతాయి. అందువల్ల ఇవి తొందరగా బాహ్య అంతరపరాన్నజీవుల బెడదకు గురవుతాయి. చూడడానికి ఇది చిన్న సమస్యే.. కాని దీనివల్ల చాలా నష్టం కలుగుతుంది. ముఖ్యంగా అంతరపరాన్న జీవుల ధట్టలు వల్ల కోళ్ళు సరిగ్గా పెరగవు, బలంగా ఉండవు. బాహ్యపరాన్న జీవులైన నల్లలు, పేలు, మైట్స్‌ వల్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. కోళ్ళు ఎంత తిన్నా పెరగవు. రక్తహీనతకు గురవుతాయి. కోళ్ళకు పేలు పట్టడం, నట్టలు పడటం వంటి సమస్యలు వచ్చిన సందర్భంలో నివారణ చర్యలు తీసుకోవాలి. కానీ వాటిని పెంచే వారు.. పెద్దగా పట్టించుకోరు. కోళ్ల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా..!

బాహ్యపరాన్న జీవుల నివారణ:

కోళ్ళ గూడును కనీసం 2-3 రోజులకొకసారైనా శుభ్రం చేయాలి. కోళ్ళ గూడులో బూడిద గాని, సున్నం గాని చల్లాలి. వారానికి ఒకసారి గూడులో పొగ బెడితే బాహ్యపరాన్న జీవులను తగ్గించవచ్చు. కార్బరిల్‌ అనే మందును కోళ్ళ గూడు, గోడలు నేలపైన చల్లాలి. పేను బెడద ఎక్కువగా ఉంటే, ఒక బ్యాగులో కార్బరిల్‌ లేదా గమాక్సిన్‌ను తీసుకొని, కోడి మెడ భాగం బయటకి, మిగతా. భాగం బ్యాగ్‌లో ఉంచి అటూ ఇటూ తిప్పాలి. ఈ చిట్కా ద్వారా పేను బెడద తొందరగా నయం అవుతుంది. ఇలాంటి మందులు వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉందాలి. బ్యూటాక్స్‌ స్ర్పే చేసేటవ్వుడు తల భాగానికి తగలకుండా, అంటకుండా చూసుకోండి.. బూడిదను కూడా చల్లి, కొంత వరకు నివారించవచ్చు.

కోళ్ళు రోజంతా బయటి ప్రదేశాల్లో తిరుగుతాయి. కాబట్టి అంతరపరాన్న జీవులైన ఏలికపాములు, నట్టల బెడద ఎక్కువగా ఉంటుంది. రైతులు కోళ్ళకు సంవత్సరానికి 2-3 సార్లు ప్రెపరాజిన్‌ అనే మందును తాగే నీళ్ళలో కలిపి తాగిస్తే అంతర పరాన్న జీవులను నివారించుకోవచ్చు.. దగ్గరలో ఉన్న వశు వైద్యశాలలో పైపరాజిన్‌ అనే మందును ఉచితంగా ఇస్తారు. రైతులు ఈ మందును కోళ్ళకు తాగిస్తే.. నాటుకోళ్ళను నట్టల బారినుంచి కాపాడుకోవచ్చు.