అడవి పందుల దాడి నుండి పంటల్ని ఈ పద్ధతులని ఉపయోగించి రక్షించుకోవచ్చు…!

-

సాధారణంగా రైతులకు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఎదురయ్యే సమస్యలు అడవి పందుల దాడి. అయితే అడవి పందుల దాడి నుండి మన పంటలని ఎలా రక్షించుకోవచ్చు అని దాని గురించి చూద్దాం.

ఇక్కడ కొన్ని రకాల పద్ధతులు ఉన్నాయి. వీటిని కనుక అనుసరిస్తే కచ్చితంగా అడవి పందుల దాడి నుండి పంటల్ని కాపాడుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు దీనికోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.అడవి పందులు శాకాహారం, మాంసాహారం రెండింటిని తింటాయి. శాకాహారంలో వేర్లు, దుంపలు వంటివి తింటాయి. మాంసాహారం విషయానికి వస్తే పురుగులు, కీటకాలు పాములు వంటివాటిని తింటాయి.

వీటికి వాసన గ్రహించే ఎటువంటి శక్తి ఉంటుంది. వాసన ద్వారా పంటల్ని గుర్తించి అక్కడికి వచ్చి పంటల్ని నాశనం చేస్తాయి. రాత్రి వేళలో ఎక్కువగా అర్ధరాత్రి పూట ఇవి గుంపులుగా సంచరిస్తూ ఉంటాయి. అయితే అడవిపందుల చేత పంట చిక్కితే ఇంకా పంట నాశనమే. కనుక వాటి నుండి పంటని ఈ టిప్స్ ని ఫాలో అయ్యి రక్షించుకోండి.

వాసన శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా గుర్తించకుండా పంటలకి వేరే వాసన వచ్చేటట్టు మీరు ప్రయత్నం చెయ్యొచ్చు.
అలాగే పంట చుట్టూ పాత చీరలని కట్టి ఆ పద్ధతి ద్వారా రక్షించుకోవచ్చు.
పంట చుట్టూ వెంట్రుకలు వెదజల్లి పద్ధతి ద్వారా పంటను రక్షించుకోవడం
ఫోర్ట్ గుళికల పద్ధతి కూడా మంచి పద్ధతి.
పంటి చుట్టూ కుళ్లిన కోడిగుడ్లని స్ప్రే చేయడం వల్ల కూడా పంటలు రక్షించుకోవచ్చు.
గంధకం మరియు పంది కొవ్వు నూనెను కూడా వాడొచ్చు.
అడ్డుగోడ లాంటి పంటలు వేయడం కూడా మంచి పద్దతే.
కంచె వేయడం.
కందకము పద్ధతి.

Read more RELATED
Recommended to you

Latest news