పాల్వంచ ఘటనలో సంచలన విషయాలు… తన భార్యను పంపాలంటున్నాడని ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో

పాల్వంచ కుటుంబ ఆత్మహత్య ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యే వనమా కుమారుడు వనమా రాఘవ అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవల పాల్వంచలో రామక్రిష్ట తన భార్య ఇద్దరు కుమార్తెలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ లెటర్ లో తన చావుకు కారణం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవ అంటూ ఆరోపణలు చేశాడు. తాజాగా ఆత్మహత్యకు ముందు రామక్రిష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ఇందులో సంచలన విషయాలను వెల్లడించాడు మృతుడు రామక్రిష్ణ.

సెల్ఫీ వీడియోలో ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులను గురించి వివరించాడు. వనమా రాఘవపై తీవ్ర ఆరోపణలు చేశాడు. రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయన్నాడు. ఇలాంటి వ్యక్తిని రాజకీయాల్లో ఎదగనివ్వద్దని అన్నాడు. అప్పు చేసిన డబ్బు అడిగినా.. ఇచ్చే వాడికి కానీ.. నాభార్య కావాలని అడిగాడిని సంచలన విషయాలను వెల్లడించాడు. ఏ భర్త వినకూడని మాటలను రాఘవ అడిగాడని… నీ భార్యను హైదరాబాద్ తీసుకువస్తే నీ సమస్య పరిష్కారం అవుతుందని అన్నాడని ఆరోపించాడు. నేను ఒక్కడినే చనిపోతే.. నాభార్య పిల్లలను వదిలిపెట్టరు అని వీడియోలో తెలిపాడు. రాజకీయ, ఆర్థిక బలంతో.. నాబలహీనతలతో ఇబ్బందులకు గురిచేశాడని రామక్రిష్ణ ఆరోపించాడు. అప్పుల్లో ఉన్నానని తెలసినా.. నా తల్లి, అక్క కక్ష సాధించారని వెల్లడించారు.

ప్రస్తుతం వనమా రాఘవ పరారీలో ఉన్నాడు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.