శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకం.. రైతులకు శిక్షణ ఇచ్చేందుకు కార్యచరణ సిద్దం  

-

ప్రస్తుతం దేశంలో పెద్దఎత్తున తేనెటీగల పెంపకం జరుగుతుండగా, భారత్‌లో తయారయ్యే తేనె విదేశాలకు కూడా ఎగుమతి అవుతోంది. అయితే వ్యవస్థీకృత కృషి లేకపోవడంతో దేశంలో ఉత్పత్తి అయ్యే తేనెకు బలమైన గుర్తింపురావడం లేదు. తేనె ఉత్పత్తి చేసే రైతులకు కూడా ప్రయోజనం లేదు. NDDB దేశవ్యాప్తంగా.. రైతులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. శాస్త్రీయ పద్దతితిలో తేనెటీగలను పెంచేలా ప్రణాళికలు సిద్దం చేశారు.
దీని కింద దేశంలోని డెయిరీ కోఆపరేటివ్ నెట్‌వర్క్ దేశం యొక్క తేనెపై సరికొత్త ప్రణాళికతో ఉంది. జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB) , నేషనల్ బీ బోర్డ్ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఆన్ ఎపిక్చర్ అండ్ హనీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌డిడిబి ఛైర్మన్ మీనేష్ షా మాట్లాడుతూ తేనెటీగల పెంపకాన్ని దేశంలో స్వతంత్ర సంస్థగా అభివృద్ధి చేయవచ్చని అన్నారు. దేశంలోని డెయిరీ నెట్‌వర్క్‌ను దృష్టిలో ఉంచుకుని తీపి విప్లవంగా తేనెను పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
డెయిరీ నెట్‌వర్క్‌ని ఉపయోగించి శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దేశంలోని డెయిరీ సహకార సంఘాలు తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడానికి సమర్థవంతమైన సాధనంగా ఉన్నాయని ఎన్‌డిడిబి చైర్మన్ మినేష్ షా అన్నారు. రైతులను తేనెటీగల పెంపకందారులను సంఘటితం చేస్తూ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కోసం కూడా కృషి చేస్తున్నామని తెలిపారు.శాస్త్రీయ పద్ధతిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ తేనె ఉత్పత్తి చేసేలా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తిని పెంచేందుకు కూడా తేనెటీగల పెంపకం దోహదపడుతుంది.
తేనెటీగల పెంపకంలో స్వయం ఉపాధికి మంచి అవకాశం ఉంది, రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది.. కెవికెలు, డెయిరీ కోఆపరేటివ్ నెట్‌వర్క్‌ల సహకారంతో తేనెటీగల పెంపకం మరియు తేనె ఉత్పత్తిని శాస్త్రీయ పద్ధతిలో ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా రైతులకు ఎన్‌డీడీబీ శిక్షణ ఇవ్వడం ప్రారంభించిందని ఛైర్మన్ మినేష్ తెలిపారు. ఎన్‌డిడిబి ఇప్పటికే 40 శిక్షణా కార్యక్రమాలను నిర్వహించిందని, ఇందులో 1100 మంది రైతులు పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కూడా గిరిపుత్రులకు తేనె ఆదాయ వనరే కానీ.. దానిపై ప్రత్యేక శ్రద్ధ, మార్కెటింగ్ సౌకర్యం లేక.. వారు నష్టపోతున్నారు. కష్టపడి తేనె సేకరించినా..తుక్కవ ధరకే వాళ్ల దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ఇలాంటి శిక్షణ, ప్రోత్సాహం ఎంతోమందికి ఉపయోగపడుతుందనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news