Beast: తెలుగు అరబిక్ కుత్తు వచ్చేసిందోచ్..

-

త‌మిళ స్టార్ హీరో విజ‌య్, బ్యూటీఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే క‌లిసి న‌టించిన సినిమా బీస్ట్. ఈ సినిమా విడుద‌లకు ముందే రికార్డుల‌ను తిర‌గ‌రాస్తుంది. ఇటీవ‌ల విడుద‌ల త‌మిళ వ‌ర్షన్ ట్రైల‌ర్ కూడా దూసుకుపోతుంది. కాగ ఈ బీస్ట్ సినిమా నుంచి అర‌బిక్ కుత్తు అనే సాంగ్ ఫిబ్ర‌వ‌రి నెల‌లో విడుద‌ల అయిన విషయం తెలిసిందే. ఈ అర‌బిక్ కుత్త సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేసేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పాట అతి త‌క్కువ కాలంలోనే 264 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి. ఈ పాట త‌మిళ వ‌ర్షన్ లో ఉన్నా.. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.

కోలీవుడ్, బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ ప‌లువురు న‌టీ న‌టులు ఈ పాటకు స్టెప్పులు వేస్తు.. సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పాట‌కు మ్యూజిక్ ను అనిరుద్ అందించాడు. అలాగే లిరిక్స్ ను శివ‌కార్తికేయ‌న్ అందించాడు. కాగ ఈ పాట‌ను తాజా గా తెలుగు వ‌ర్షన్ లో చిత్ర బృందం విడుద‌ల చేసింది. కాసేప‌టి క్రితం చిత్ర బృందం తెలుగు తో పాటు హింది వ‌ర్షన్ అర‌బిక్ కుత్తు సాంగ్ ను విడుద‌ల చేసింది.

త‌మిళ వ‌ర్షన్ తో ఫిబ్ర‌వ‌రిలో వ‌చ్చిన అర‌బిక్ కుత్తు సాంగ్… దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విషయం తెలిసిందే. తాజా గా విడుద‌ల అయిన తెలుగు వ‌ర్షన్ అర‌బిక్ కుత్తు ఎన్ని వ్యూస్ ద‌క్కిచుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news