బిజినెస్ ఐడియా: దానిమ్మ సాగుతో ఆదాయం లక్షల్లో.. పైగా నో రిస్క్..!

-

ఎక్కువ మంది ఉద్యోగాల కంటే వ్యాపారాలు చేయడానికి ఇష్ట పడుతున్నారు. ఉద్యోగాలు కంటే వ్యాపారానికి ఈ మధ్య డిమాండ్ పెరుగుతోంది. పైగా వ్యాపారాన్ని చేయడం వల్ల మంచిగా డబ్బులు కూడా వస్తున్నాయి. అందుకనే చాలా మంది ఉద్యోగాలను కాదనుకుని వ్యాపారాలు చేస్తున్నారు. మీరు కూడా ఏదైనా బిజినెస్ ని చేయాలనుకుంటున్నారా..? ఆ బిజినెస్ ద్వారా మంచిగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే తప్పకుండా మీరు ఈ బిజినెస్ ఐడియా గురించి చూడాలి.

 

ఈ బిజినెస్ ని చేయడం వల్ల మంచిగా డబ్బులు వస్తాయి. పైగా ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. అదే దానిమ్మ సాగు. భారతదేశంలో ఈ మధ్య కాలం లో రైతులు దానిమ్మ సాగు పై దృష్టి పెట్టారు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల్లోకి వెళితే… మన ఇండియాలో చూసుకున్నట్లయితే యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఏపీ వంటి చోట దీని సాగు బాగుంటుంది. దానిమ్మ మొక్క పెరిగి పండ్లు కాయడానికి మూడు నుండి నాలుగు సంవత్సరాల కాలం పడుతుంది.

దానిమ్మ చెట్టు సుమారు 24 సంవత్సరాలు బతుకుతుంది. ఎవరైనా దానిమ్మ సాగు చేయాలనుకుంటే ఆగస్టు లేదా మార్చిలో దానిమ్మ మొక్కలు నాటడం ఉత్తమం. వీటిని నాటడానికి నెల రోజుల ముందు గుంతలు తవ్వాలి.

ఏ రకమైన నేల పైన అయినా దీనిని పెంచొచ్చు. సుమారు 20 కిలోల పేడ, ఫాస్ఫరస్ ఈ సాగు కోసం ఉపయోగించాలి. అలానే ఈ మొక్కలకు తగినంత నీటి పారదులు ముఖ్యం ఈ మొక్కలు కి ఐదు నుండి ఏడు రోజులకు ఒకసారి నీరు పెట్టాలి అలానే పండ్లు పూర్తిగా పండే వరకు కోయకూడదు. ఒక హెక్టారు దానిమ్మ ని పండించడం వల్ల 8 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news