జొన్నసాగులో తెగుళ్ళు, చీడపీడలా..ఈ పద్ధతులు పాటించండి.!

-

చిరుధాన్యాలలో సాగుకు అనుకులమైనది ప్రధానంగా జొన్న. ఆహారానికి, పుశుగ్రాసానికి జొన్న అవసరం ఉండటంతో..రైతులు ఈ పంటను పండిచటంలో లాభాలు పొందుతారనటంలో ఏమాత్రం సందేహం లేదు. మార్కెట్లో కూడా నాణ్యమైన జొన్నకు మంచి డిమాండ్ ఉంది. అయితే జొన్నలో సరైన యాజమాన్య పద్దుతులు పాటిస్తే తెగుళ్లు, చీడపీడలను నిర్మూలించుకుని లాభం పొందవచ్చు.

జొన్నలో ఎక్కువగా వచ్చే చీడపీడలు, తెగుళ్లు

మొవ్వు తోలుచు ఈగ: జొన్నపంటలో ముఖ్యంగా మొవ్వు తోలుచు ఈగ బెడద ఉంటుంది. పురుగు సోకిన మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. మొవ్వువి లాగినపుడు సుళువుగా పచ్చి, కుళ్ళపోయిన వాసన వస్తుంది . పిలకలు అధికంగా వస్తాయి. మొలకెత్తిన మొదటి 30 రోజుల వరకు మాత్రమే ఈ పురుగు వస్తుంది.
కాండం తొలుచు పురుగు: ఈ పురుగు, పైరును 30 రోజుల తర్వాత నుండి పంట కోసేవరకు అశిస్తుంది. పారదర్శకయైన మచ్చలు గుండ్రని రంధ్రాలు ఆకుల పై ఏర్పడుతుంది. కాండాన్ని చీల్చి చూస్తే ఎర్రని కణజాలం కనపడుతుంది. కంకి మొవ్వులో నుండి బయటకు రాదు.
గింజబూజు: గింజల పై బూజు లక్షణాలు వర్షాకాలలలో ఇది అధికంగా కనిపిస్తుంది. పూత మరియు గింజ గట్టీపడే సమయంలో వర్షాలు పడితే నష్టం ఎక్కువ.

నివారణ మార్గాలు:

జొన్నను ఆశించే ఈ చీడపీడలను నివారించుకునేందుకు 10 లీటర్ల నీటికి 20 గ్రా. కాప్టాన్తో పాటు, 2 గ్రా. ఆరియోఫంగిన్ ను గాని లేక లీటరు నీటికి 1 గ్రా కార్చండజిమ్ ని గాని కలిపి గింజ ఏర్చడే దశలో ఒకసారి, గింజ గట్టిపడే దశలో మరోసారి పిచికారి చేయాలి. పంటకోత ఆలస్యం చేయకూడదని గుర్తుంచుకోండి..
కంకి నల్లి: పిల్ల, పెద్ద పురుగులు గింజలు పాలు పోసుకునే దశలో రసం పీల్చటం వలన గింజలు నొక్కులుగా మారి కంకిలో కొన్నే మంచి గింజలు వుంటాయి. గింజల మీద ఎరుపు మచ్చలు ఏర్చడి అవి క్రమంగా సల్లగా మారుతాయి. గింజలు గట్టి పడిన తర్వాత ఈ పురుగు అశించదు. దీని నివారణకు తొలిదశలోనే కంకి నల్లిని గుర్తించి, తొలకరిలో విత్తుకోవటం ద్వారా దీని ఉద్ధృతిని అరికట్టపచ్చు. ఎకరాకు 8 కిలోల కార్బరిల్ పొడిమందును కంకుల మీద చల్లుకోవాలి.
బంకకారు తెగులు: మొక్కలు పుష్పించే దశలో ఆకాశం మేఘావృతమై,చల్లని తేమతో కూడిన వాతావరణం ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం. తెగులు సోకిన కంకుల నుండి తెల్లని లేదా గులాబీ రంగుతో కూడిన తీయ్యటి జిగురు వంటి ద్రవం కారుతుంది. దాని పై కొన్ని శశిలీంధ్రలు పెరగడం వల్ల కంకులు నల్లగా కన్పిస్తాయి. అనుకూల వాతావరణం లో వీటి నుండి పొడవైన వంకర తిరిగిన గోధుమ రంగు స్ల్కిరోషీయా ఏర్పడతాయి. దీని నివారణకు ౩ గ్రా కాప్టాస్ లేక ధైరమ్ కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. లిటరు నీటికి మాంకోజెబ్ 2 గ్రా. లేదా బెన్ లేట్ 1 గ్రా లేదా కార్బ౦డజిమ్ 1 గ్రా. కలిపి వార౦ వ్యవధిలో 2 సార్లు పూతదశలో చల్లాలి.
ఇలా జొన్నసాగులో వచ్చే వివిధ రకాల చీడపీడలను తొలిదశలోనే గుర్తించి..సరైన మందులు వాడటం వల్ల అధిగ దిగుబడి పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news