ఈ సీజన్ లో ఎక్కువగా మామిడి పండ్లతో పాటు నేరేడు కూడా ఎక్కువ దర్శనమిస్తాయి.ఈ నేరేడు సాగులో కొన్ని మెలుకువలు తీసుకోవడం వల్ల మంచి లాభాలను పొందవచ్చునని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం…
ఎరువులు, పురుగు మందుల నిర్వహణలో మెరుగైన మెళకువలు నేర్చుకుని నేరేడు తోటలను లాభసాటిగా మార్చుకోవచ్చని చెబుతున్నారు.కేవలం100 చెట్లు ద్వారా దాదాపు 3 లక్షలు మేర ఆదాయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి నుంచి నేరేడు తోట పుష్పించే దశకు వచ్చింది. పుష్పించే దశ నుంచి ఫలాలు వచ్చే దశ వరకు, ఉత్తమ నిర్వహణ పద్ధతులు అనుసరించడం ద్వారా మరింత దిగుబడి పొందగలుగుతారని అంటున్నారు..ఎన్నో రొగాలను నయం చేస్తుంది.. దాని వల్ల సీజన్ లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే వుంది.ప్రస్తుతం మార్కెట్ లో నేరేడు పండ్లు కిలో రూ.200 నుంచి రూ.150 పలుకుతున్నాయి. నేరేడు పంట ద్వారా ఎక్కువ ఆదాయం రావడంతో చాలా మంది రైతులు నేరేడును సాగుచేసేందుకు ముందుకు వస్తున్నారు. ఉద్యానవన శాఖ ఆయా రైతులకు సబ్సిడీ కూడా ఇస్తున్నారు.. ఈ పంట పై ఎటువంటి సందెహాలు ఉన్న దగ్గర లోని వ్యవసాయ నిపునుల సలహా తీసుకోవడం మంచిది..