ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి స్పందించిన ఉద్ధవ్ ఠాక్రే

-

మహా రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలలో మాహ వికాస్ అఘాడి సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఓడిపోయింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఉద్దవ్ ఠాక్రే తొలిసారి స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై విమర్శలు సంధించారు. బిజెపి నేతలు వెన్నుపోటు పొడిచారని తేల్చిచెప్పారు. ఏక్నాధ్ షిండేను ఆయుధంగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు.

తనకు వెన్నుపోటు పొడిచినట్లుగా ఇప్పుడిక ముంబైకర్లకు వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. ముంబైకర్ల జీవితాలతో ఆటలాడుకోవద్దు అంటూ హెచ్చరించారు. గతంలో చేసిన విధంగా అమిత్ షా తన మాటకు కట్టుబడి ఉంటే ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండేవారని అన్నారు. ఇప్పుడు శివసేన కార్యకర్త అని పిలవబడిన వ్యక్తినే ముఖ్యమంత్రిని చేశారని విమర్శించారు. సీఎం పదవి రొటేషన్ విషయంలో అమిత్షా వెనక్కి తగ్గలేదని అన్నారు.

బీజేపీ, శివసేన పార్టీల మధ్య సిఎం పదవి పంచుకునేందుకు గతంలో ఆమిత్ షా అంగీకరించలేదని, బీజేపీ వ్యక్తే సీఎం గా ఉండాలని అమిత్ షా పట్టుబట్టారని తెలిపారు. ఇప్పుడు ఏక్నాధ్ షిండే కి అవకాశం ఇచ్చినట్లుగా తాము బిజెపితో కలిసి ఉన్నప్పుడు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version