పశువులకు వేసే పచ్చి గడ్డి గురించి తప్పక తెలుసుకోవాలి..

-

పశువులకు పచ్చి మేత చాలా అవసరం..వాటిని తినడం వల్లే అవి మరింత బలంగా ఉంటాయి.పశుగ్రాసాలను పుష్కలంగా మేపడం వల్ల 25% పాల దిగుబడి పెరుగుతుంది.పశుగ్రాసాలలో మాంసకృత్తులు, పిండి పదార్ధాలు, కొవ్వు పదార్ధాలు అధికంగా లభ్యమవుతాయి. కాబట్టి పశుగ్రాసాల వాడకం వల్ల ఖరిధైన సమీకృత దాణాపై ఖర్చు తగ్గి పాడి పరిశ్రమ లాభదాయక మవుతుంది. పశుగ్రాసాల సాగును ఆహార ధాన్యాలకు, వాణిజ్య పంటలకు హాని కలుగకుండా చేపట్టవచ్చు.
పశుగ్రాసాలను వాణిజ్యపరంగా పెద్ద ఎత్తున సాగు చేసి , అమ్మి ఆదాయం పొందే అవకాశాలున్నాయి. పశుగ్రాసాల వాడకం వల్ల పశువుల్లో పునరుత్పత్తి ప్రక్రియఉంటుంది. ప్రత్యేకంగా పశుగ్రాసాలకు భూమి కేటాయించలేని వారు ఇతర పంటల సాళ్ళ మధ్య మిశ్రమ పంటగాను, పండ్ల తోటల సాళ్ళ మధ్య పశు గ్రాసం పండించడం అలవాటు చేసుకోవాలి. వాతావరణం, నీటి వనరులను బట్టి వ్యవసాయంతో పాటు పచ్చిమేతలు సాగు చేసుకోవడం మంచిది..కొరత వుండదు ఆదాయం కూడా..

ఇకపోతే పశుగ్రాసాలు పంట కాలం బట్టి ఏకవార్షికలు, బాహు వార్షికలు విభజించవచ్చు. ఒక సంవత్సరం కాలంలో పంట పూర్తి అయి ఒకటి అంతకు మించిన కోతలలో పశుగ్రాస దిగుబడినిచ్చే రకాలను ఏకవార్షికలు అంటారు. బాహు వార్షికలు అనగా ఒకసారి నాటితే 4-5 సంవత్సరాల పాటు పలు కోతలలో దిగుబడి ఇచ్చే రకాలు..సుబాబుల్ లేదా అవిస లాంటి పశుగ్రాసపు చెట్టు వేస్తె సంవత్సరం పొడవునా రోజుకు 10-12 కిలోల పచ్చి మేత లభిస్తుంది. అర ఎకరం భూమిలో నీటి ఆధారంగా పండించే పశుగ్రాసాలతో రెండు పాడి పశువులను లాభసాటిగా పోషించవచ్చు.పశుగ్రాస ఎంపికలో నీటి వసతి ముఖ్య పాత్ర వహిస్తుంది..తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి పొందవచ్చు…

రోజుకు 30-40 కిలోల పచ్చి మేత అవసరం ఉంటుంది. పచ్చి మేత పుష్కలంగా అందిస్తే 5 లీటర్ల పాల దిగుబడి ఎలాంటి దాణా అవసరం లేకుండా పొందవచ్చు. పశు గ్రాసాన్ని ముక్కలుగా కత్తిరించి మేపాలి. దీని వల్ల పశువులకు 10-15 % ఎక్కువ గ్రాసాన్ని సంగ్రహిస్తాయి.దీని వల్ల 70% మేరకు మాత్రమే తిని కండలను తొక్కి మల, ముత్రాలతో పాడు చేస్తాయి. చిన్న చిన్న ముక్కలుగా కాండాలను కత్తిరించి మేపితే 90% మేత సద్వినియోగం అవుతుంది. అనేక రకాల పశు గ్రాసాలను కలిపి వృధా కాకుండా ఒకేసారి వినియోగపడే నట్లు చేయవచ్చు. ముక్కలుగా కత్తిరించిన గ్రాసాన్ని బస్తాలో నింపి సులభంగా తక్కువ స్థలంలో నిల్వ చేయవచ్చు…ఈ పశుగ్రాసాల వల్ల విటమిన్లు, ఖనిజ లవణాలు, మోలాసిస్ వంటివి తేలికగా కలపవచ్చు. రుచి కూడా పెరుగుతుంది..ప్రత్యేక యంత్రంతో కత్తిరించి వేయడం మంచిదని గుర్తుంచుకోవాలి… వృధా కాదు..పశువులు కూడా బలంగా తయారు అవుతాయి..

Read more RELATED
Recommended to you

Latest news