అల్జీమర్స్‌ వ్యాధికి బీర్‌ పరిష్కారమా..? అధ్యయనాలు ఏం చెప్తున్నాయి..?

-

వయసు పెరిగేకొద్ది..అందరికి కామన్‌గా వచ్చే వ్యాధుల్లో మతిమరుపు ఉంటుంది. ఏది సరిగ్గా గుర్తుకు ఉండదు. అల్జీమర్స్‌ వల్ల ఇలా జరుగుతుంది. ముఖ్యంగా వృద్ధులు ఈ వ్యాధితో బాగా బాధపడుతున్నారు. నిపుణులు సైతం దీనికి సరైన చికిత్స ఇవ్వలేకపోతున్నారు. వ్యాధి లక్షణాలను గుర్తించేసరికే బాధితుల నాడీ వ్యవస్థ కోలుకోలేని స్థాయిలో దెబ్బతింటోందట…అందుకే వ్యాధిని ముందస్తుగా గుర్తించే, నివారించే ప్రక్రియలను అభివృద్ధి చేయడానికి పరిశోధనలు ఇంకా జరుగుతున్నాయి.
అల్జీమర్స్‌ను ప్రారంభ దశల్లో గుర్తించే పాజిట్రాన్‌ ఎమిషన్‌ టోమోగ్రఫీ ఇమేజింగ్‌ టెక్నిక్‌ను అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అయితే బీర్‌ తయారీలో ఉపయోగించే హాప్‌ పూల ద్వారా అల్జీమర్స్‌ రాకుండా నివారించే అవకాశం ఉందని మరో అధ్యయనంలో తేలింది. హాప్ పువ్వుల నుంచి సేకరించిన రసాయనాలు, అల్జీమర్స్ వ్యాధి (AD)తో సంబంధం ఉన్న అమిలాయిడ్ బీటా ప్రోటీన్‌ల సమూహాన్ని నిరోధించగలవట.. హాప్ వాడే డ్రింక్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు ఉండవచ్చని, అల్జీమర్స్‌పై ప్రభావం చూపే లక్షణాలు ఇందులో ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు.

బీర్‌లో సువాసన కోసం హాప్‌ పువ్వుల వినియోగం

బీర్‌ తయారీలో సువాసన కోసం వినియోగించే హాప్ పువ్వులు న్యూట్రాస్యూటికల్స్‌లో ఒకటిగా గుర్తించారు పరిశోధకులు. హాప్స్‌లోని ఏ రసాయన సమ్మేళనాలు ఈ ప్రభావాన్ని కలిగిస్తున్నాయో తెలుసుకోవాలని రిసెర్చర్లు అధ్యయనం చేశారు. ఈ సమ్మేళనాలను గుర్తించడానికి, బ్రూయింగ్ ప్రక్రియకు సమానమైన పద్ధతిని ఉపయోగించి నాలుగు సాధారణ రకాల హాప్‌లను ఎక్స్‌ట్రాక్ట్‌ చేసి వర్గీకరించారు. పరీక్షలలో ఈ ఎక్స్‌ట్రాక్ట్స్‌ యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్నాయని, మానవుల నరాల కణాలలో అమిలాయిడ్ బీటా ప్రోటీన్లు అతుక్కోకుండా నిరోధించగలవని కనుగొన్నారు.
అనేక రకాల లాగర్లు, లైటర్ ఆలెస్‌లలో కనిపించింది. ఇది శరీరాన్ని మిస్‌ఫోల్డెడ్‌, న్యూరోటాక్సిక్ ప్రోటీన్‌లను క్లియర్ చేయడానికి ఉపయోగపడే ప్రక్రియలను కూడా ప్రోత్సహించింది. దీంతో అల్జీమర్స్‌ను అభివృద్ధిని ఎదుర్కొనే న్యూట్రాస్యూటికల్స్‌ను హాప్ సమ్మేళనాలు బలోపేతం చేస్తాయని పరిశోధకులు అంటున్నారు. సో.. మొత్తంగా చెప్పేది ఏంటంటే.. హాఫ్‌ పువ్వులతో తయారైన బీర్‌ తాగడం వల్ల అల్జీమర్స్‌ వ్యాధిని ఎదుర్కోవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news