ప్రీ వెడ్డింగ్ కల్చర్ బాగా పెరిగి పోయింది. ఒకప్పుడు పెళ్లికి ముందు బయట తిరగడం ఉండేది కాదు. ఇప్పుడు అంతా మారిపోయింది. ప్రీ వెడ్డింగ్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దానికోసం లక్షలు లక్షలు ఖర్చు చేస్తున్నారు.
అయితే.. ప్రీ వెడ్డింగ్ వీడియోలో బాగా కనిపించడానికి చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
ప్రస్తుతం కొత్తగా పెళ్లి చేసుకోబోయే వారు ప్రీ వెడ్డింగ్ కోసం ఎలాంటి స్కిన్ కేర్ పాటించాలో తెలుసుకుందాం.
చర్మం రకాన్ని అర్థం చేసుకోవాలి:
మీరు మీ చర్మాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒకే రకమైన స్కిన్ కేర్ రొటీన్ సరిపోదు. ఉదాహరణకు జిడ్డు చర్మం గల వారికి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ వాడాలి. తేమ లేకుండా చర్మం పొడిబారుతుంటే.. హ్యాలురోనిక్ యాసిడ్ కలిగిన మాశ్చరైజర్స్ వాడాలి.
ఒకే రకమైన స్కిన్ కేర్ రొటీన్:
మాటిమాటికి స్కిన్ కేర్ ప్రొడక్టులను మార్చకూడదు. ఒకే రకమైన స్కిన్ కేర్ ప్రొడక్టులను ఎక్కువ కాలం పడటం వల్ల, వాటి ప్రభావం మీ చర్మం మీద ఉంటుంది.
ఫేషియల్స్:
ప్రీ వెడ్డింగ్ కి మూడు నెలల ముందు నుండి ఫేషియల్స్ చేయించుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనివల్ల మీ చర్మం మెరిసిపోతుంది.
ఫేస్ మాస్క్:
పార్లర్స్ కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవాలి అనుకుంటే ఫేస్ మాస్కులు బాగా పనిచేస్తాయి. ఫేస్ మాస్కుల వల్ల చనిపోయిన చర్మకణాలు తొలగిపోతాయి.