వృద్ధాప్య ఛాయలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ప్యాక్‌తో చెక్ పెట్టండి..!

-

మందారం జుట్టుకు మంచిదని చాలా మందికి తెలుసు..కానీ మందారంతో వృద్ద్యాప్య ఛాయలను కూడా తరిమికొట్టచ్చని మీకు తెలుసా..మందారంలో ఉండే యాంటీ బయాటిక్స్ శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. జుట్టుతో పాటు చర్మానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మందార ఫేస్ ప్యాక్ చర్మంపై వృద్ధాప్య ఛాయలను తొలగించడంలో అద్భుంగా పని చేస్తుంది. చర్మ సంరక్షణ కోసం మందార పువ్వును ఉపయోగించవచ్చునని, ఇది చర్మాన్ని మృదువుగా, తాజాగా, యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.. మందారంతో ఫేస్ ప్యాక్ ఎలా చేయాలో ఈరోజు చూద్దాం..

 

మందార, అలోవెరాతో యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్

మందారం పొడితో ఈ యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్‌ను తయారు చేయొచ్చు. ఈ పౌడర్‌ను మార్కెట్‌లో అమ్ముతారు..లేదంటే.. ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎండిన మందార పువ్వులను గ్రైండర్ లేదా ఫుడ్ ప్రాసెసర్ ఉపయోగించి గ్రైండ్ చేయండి. ఒక గిన్నెలో 2 టీస్పూన్ల మందార పొడిని తీసుకుని అందులో అవసరమైన మొత్తంలో అలోవెరా జెల్ కలపాలి. దీన్ని మిక్స్ చేసి, ఫేస్ మాస్క్‌ని ముఖంతో పాటు మెడకు కూడా అప్లై చేయాలి. చర్మంపై మృదువుగా మసాజ్ చేయాలి. 15-20 నిమిషాలు పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత మంచినీటితో కడిగేయాలి. వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తే అద్భుతమై ప్రయోజనాలు ఉంటాయి.

మందారం, గ్రీన్ టీ..

ఒక గిన్నెలో రెండు చెంచాల మందార పొడిని తీసుకోండి. దానికి 1-2 టేబుల్ స్పూన్ల గ్రీన్ టీ కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై రాయండి… వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి. 15-20 నిమిషాల పాటు ఫేస్ మాస్క్‌ను అలాగే ఉంచి…ఆ తరువాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని వారానికి 2 లేదా 3 సార్లు చేయొచ్చు.

మందారం, నిమ్మకాయ..

ఒక గిన్నెలో రెండు చెంచాల మందార పొడిని ఒక తాజా నిమ్మకాయ రసాన్ని కలపండి. కొంచెం నీటిని కూడా కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఆ తరువాత ముఖంతో పాటు.. మెడ చుట్టూ..అప్లై చేయాలి. చర్మంపై 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తరువాత మంచినీటితో కడగాలి. వారానికి 2 లేదా 3 సార్లు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.

మందారం, పెరుగు..

ఒక గిన్నెలో 2 టీస్పూన్ల మందార పొడిని తీసుకోండి. దానికి అవసరమైన మొత్తంలో పెరుగును కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖంతో పాటు మెడకు కూడా రాయండి… 15-20 నిమిషాలు అలాగే ఉంచి…ఆ తరువాత మొఖాన్ని మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని వారానికి 2 లేదా 3 సార్లు చేస్తే… ముఖంపై ముడతలు, వృద్ధాప్య ఛాయలు క్రమంగా తొలగిపోతాయి.

ఇలా మందారపొడితే ఫేస్ ప్యాక్స్ వేస్తే..ఫేస్ మంచి గ్లోయింగ్ రావడంతోపాటు..ముడతలు కూడా పోతాయి. మరి ఇంకెందుకు లేట్..ఓ సారి ట్రై చేసి చూడండి..నిమ్మకాయను ఎక్కువసార్లు వాడటం మంచిది కాదు..ఫేస్ పై పింపుల్స్, మచ్చలు ఉంటేనే..నిమ్మకాయ, మందారపొడి చిట్కా వాడండి..అది కాకుండా పైన పేర్కొన్న చిట్కాలను హ్యాపీగా అప్లై చేయొచ్చు. అలొవెరా పడనివాళ్లు కూడా అది స్కిప్ చేసి..గ్రీన్ టీ చిట్కా ట్రే చేయొచ్చు. గ్రీన్ టీ ఫేస్ కి మంచి ఫలితాలను ఇస్తుంది.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news