వేసవి వేడిని చల్లార్చడమే కాదు చర్మ సంరక్షణలో మేలు చేసే కొబ్బరి నీళ్ళు.. ప్రయోజనాలివే..

-

వేసవి వచ్చిందంటే అందరూ ఆందోళన చెందేది చర్మం గురించే. వేడి కారణంగా చర్మంపై ఏర్పడే చెమటకాయ మొదలగు వాటి నుండి ఎలా కాపాడుకోవాలా అని చూస్తుంటారు. దీనికోసం శరీరాన్ని చల్లబర్చుకోవాలని చూస్తుంటారు. ఆ విధంగా శరీరాన్ని చల్లబర్చుకోవడానికి తాగే పానీయాల్లో కొబ్బరి బొండాం ఒకటి. కొబ్బరి నీళ్ళు వేడి నుండి రక్షిస్తాయి. శరీరాన్ని చల్లబర్చి వ్యాధుల బారిన పడకుండా చూసుకుంటాయి. కేవలం అదేకాదు కొబ్బరి నీళ్ళ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. చర్మానికి కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

మొటిమలతో పోరాడుతుంది

కొబ్బరి నీళ్ళలో యాంటీసూక్ష్మజీవుల లక్షణాలు ఉంటాయి. వీటి కారణంగా చర్మంపై మొటిమలు తొలగిపోతాయి. ఇది డైరెక్టుగా పనిచేయకపోయినా మీ చర్మ సంరక్షణకి అదనపు శక్తిని ఇచ్చి మొటిమలను, మచ్చలను దూరం చేయడంలో సాయం చేస్తుంది.

తేమ

కొబ్బరి నీళ్ళలో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. వేసవిలో చర్మం పొడిబారడం ప్రధానమైన సమస్య. కొబ్బరి నీళ్ళని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ సంరక్షణలో సాయపడి తేమగా ఉంచుతుంది.

వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది.

ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మంపై ఏర్పడే వృద్ధాప్య గీతలను ముడతలను తగ్గిస్తుంది. తద్వారా చర్మం మరింత యవ్వనంగా ఉంటుంది. ఐతే కొబ్బరి నీళ్ళని డైరెక్టుగా తాగడమే కాకుండా దాన్ని చర్మ సంరక్షణలో తయారు చేసుకునే పేస్టులో కూడా వాడవచ్చు.

పసుపు, శనగపిండి, కొబ్బరినీళ్ళ ఒక దగ్గర కలుపుకుని పేస్టులాగా తయారు చేసుకుని ముఖానికి మాస్క్ లాగా వర్తించండి. ఆ తర్వాత కొద్దిసేపటికి నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల చర్మం మరింత యవ్వనంగా కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news