జుట్టు ఎక్కువ ఊడిపోతోందా..? అయితే ఈ తప్పులు చేస్తున్నారు తెలుసా…?

-

చాలా మంది జుట్టు ఎక్కువ ఊడిపోతోంది అని ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే జుట్టు ఊడిపోవడానికి కారణం మనం చేసే తప్పులు కూడా. అయితే ఎటువంటి తప్పులు చేయడం వల్ల జుట్టు ఊడిపోతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ తప్పులు కనుక మీరు చేయకుండా ఉంటే కచ్చితంగా జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. మరి వాటి కోసం ఇప్పుడే పూర్తిగా చూద్దాం.

 

hairfall

ఎక్కువ హెయిర్ వాష్ చేయడం:

అయితే జుట్టును శుభ్రంగా ఉంచుకోవడం మంచిదే. కానీ అతిగా శుభ్రం చెయ్యడం అనేది చెడ్డ అలవాటు. ఎక్కువసార్లు జుట్టుని వాష్ చేయడం వల్ల సమస్యలు వస్తాయి. అలానే జుట్టు కూడా ఊడిపోతుంది.

ఓవర్ బ్లీచింగ్:

బ్లీచింగ్ వల్ల కూడా జుట్టు ఊడిపోవడానికి వీలవుతుంది. చాలా మంది బ్లూ కలర్ వేసుకున్న తర్వాత ఆకుపచ్చ వేసుకోవడం లేదా ఆరెంజ్ వేసుకోవడం ఇలా మారుస్తూ ఉంటారు. దీని వల్ల కూడా జుట్టు ఊడిపోవడానికి కారణం అవుతుందని గ్రహించండి.

సరైన దువ్వెన వాడకపోవడం:

మీరు వాడే దువ్వెన పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలి. మీ జుట్టుకి సెట్ అయ్యేటట్టు చూసుకోండి. అదేవిధంగా గట్టిగా దువ్వడం వల్ల కూడా జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు కి దారి తీస్తుంది.

అల్పాహారం తినకపోవడం:

చాలా మంది బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేస్తారు. దాని వల్ల కూడా జుట్టు ఊడిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఎక్కువ సేపు తినకుండా ఉండడం వల్ల పోషక పదార్థాలు అందవు. దీని వలన మన జుట్టు ఊడిపోతుందని చెపుతున్నారు. అలానే స్ట్రైట్నింగ్, కర్లింగ్ వంటి వాటి కారణంగా కూడా జుట్టు ఊడిపోతుందని..కనుక ఇలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news