షీకాకాయ వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో…!

Join Our Community
follow manalokam on social media

షీకాకాయ జుట్టుకి చాలా బాగా మేలు చేస్తుంది. జుట్టు ఆరోగ్యానికి పవర్ ఫుల్ రిజల్ట్స్ ని అందించే వాటిలో షీకాకాయ ఒకటి అని చెప్పవచ్చు. శతాబ్దాలుగా షీకాకాయ జుట్టు సంరక్షణకు ఉపయోగిస్తూనే ఉన్నాం. వీటిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు పూర్తిగా చూసేయండి. షీకాకాయ ఉపయోగించడం వల్ల డ్రై స్కాల్ప్ నివారించవచ్చు. ప్రతి రోజు దీన్ని రాసుకోవడం వల్ల చిట్లిన జుట్టును కూడా అరికట్టవచ్చు.

జుట్టు స్మూత్ గా, సాఫ్ట్ గా అవుతుంది. అలానే వయసు పెరిగే కొద్దీ ముడతలు ఏర్పడుతూనే ఉంటాయి. అలానే వైట్ హెయిర్ సమస్య కూడా వస్తుంది. దీని నుండి కూడా ఇదే బయట పెడుతుంది. పైగా దీనిని ఉపయోగించడం వల్ల నల్లటి జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు. రెగ్యులర్ గా షీకాకాయ మొదలైన వాటితో కలిపి హెయిర్ ప్యాక్ వేసుకుంటే తెల్ల జుట్టుని నివారించవచ్చు.

కనుక ఈ సమస్యతో బాధపడే వాళ్ళు కూడా దీనిని ఉపయోగిస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది. దీనిలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియా గుణాలు ఉంటాయి. కనుక దీనిని జుట్టుకి ఉపయోగించడం వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చుండ్రు తగ్గించవచ్చు. హెయిర్ లాస్ నుండి కూడా షీకాకాయ మంచి దారి చూపిస్తుంది. బలమైన జుట్టును కూడా ఇది అందిస్తుంది. తలలో పేలు ఎక్కువగా ఉండి ఇబ్బంది పడే వాళ్ళు దీన్ని ఉపయోగించడం వల్ల పేలు నుంచి కూడా బయట పడవచ్చు.

TOP STORIES

భక్తి: మాఘ పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి..?

మాఘ పౌర్ణమి చాల ప్రత్యేకమైన రోజు. ఆరోజు హిందువులు ప్రత్యేక పూజలు చేయడం, నదీ స్నానాలని చేయడం చేస్తారు. అలానే ధానం చేయడం మొదలైన వాటిని...