ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టిన జనసేన కార్యకర్త.. ఇంటికొచ్చి తన్నిన మంత్రి తమ్ముడు ?

Join Our Community
follow manalokam on social media

ఏపీ పంచాయితీ ఎన్నికలు ఇప్పుడు గ్రామాల్లో రచ్చ రేపుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా మంత్రి అప్పల రాజు స్వగ్రామం దేవునల్తాడలో ఫేస్ బుక్ పోస్టింగ్ ఘర్షణకు దారి తీసింది. ఫేస్ బుక్ లో మంత్రి అప్పలరాజు సోదరుడు చిరంజీవి , జనసేన కార్యకర్త పద్మారావు మధ్య పోస్టింగ్స్ వివాదం నెలకొంది. జనసేన పార్టీకి చెందిన పరపతి పద్మారావు అనే కార్యకర్త ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టులకు వైసీపీ వర్గీయుల నుంచి ఘాటైన రిప్లై లు వచ్చాయి.

అవి ముదిరి ముదిరి ఒకరి మీద ఒకరు బౌతిక దాడులు చేసుకునేదాకా వెళ్ళింది. దీంతో గతరాత్రి జనసేన కార్యకర్త పరపతి పద్మారావు పై దాడి జరిగింది. మంత్రి అప్పలరాజు సోదరుడు చిరంజీవితో పాటు మరో 30 మంది తన పై దాడిచేశారని జనసేన కార్యకర్త పద్మారావు ఆరోపిస్తున్నారు. ఆయన తల పై గాయాలు కావడంతో పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

TOP STORIES

యూపీఐ ద్వారా చెల్లింపులు జ‌రుపుతున్నారా ? ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్ ఎంతో తెలుసుకోండి..!

ప్ర‌స్తుతం దాదాపుగా ఎవ‌రిని చూసినా డిజిట‌ల్ పేమెంట్ల‌నే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. న‌గ‌దుతో లావాదేవీల‌ను చాలా త‌క్కువ‌గా చేస్తున్నారు. కార‌ణం.. బ‌య‌ట ప్ర‌తి చోటా ఆన్‌లైన్ లో...