కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఎంపీటీసీ, జడ్పిటిసి, మున్సిపల్ ఎన్నికల పై వీరి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేషన్ ఎన్నికలపై మంత్రులకు జగన్ దిశానిర్దేశం చేశారు. అన్ని రకాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. కుప్పం కోటను బద్దలు కొట్టారు అంటూ మంత్రి పెద్దిరెడ్డికి జగన్ ప్రశంసలు కురిపించారు.
ముందు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని కోరదామని వ్యాక్సిన్ త్వరగా ఇవ్వక పోతే మళ్ళీ కేసులు పెరిగే అవకాశం ఉందని జగన్ పేర్కొన్నారు. పంచాయతీల్లో చరిత్రలో లేని విధంగా 80 శాతం ఫలితాలు సాధించామని ఆయన అన్నారు. ఇక పంచాయతీ ఎన్నికల్లో భారీ విజయాల పై సీఎం జగన్ ను మంత్రులు అభినందించినట్టు తెలుస్తోంది.