జుట్టు ఎక్కువగా ఊడిపోతోందా..? అయితే ఈ టిప్స్ మీకోసం..!

-

జుట్టు రాలిపోతోందా..?, ఎన్ని ప్రొడక్ట్స్ వాడినా ఫలితం కనిపించడం లేదా..? అయితే తప్పకుండా మీరు ఈ చిన్న చిన్న చిట్కాలను అనుసరించండి. వీటిని కనుక పాటించారు అంటే మీ సమస్య తగ్గిపోతుంది. పైగా ఎటువంటి కెమికల్స్ దీనిలో ఉండవు.

పూర్తి నేచురల్ పద్ధతులు ఇవి. అయితే జుట్టు రాలే సమస్య నుండి బయట పడాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఉసిరి నూనె:

ఉసిరిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం మీరు కొన్ని ఉసిరికాయల్ని కట్ చేసి ఎండలో ఎండబెట్టాలి.

ఆ తర్వాత కొబ్బరి నూనె, నువ్వుల నూనె సమానంగా తీసుకుని మరిగించి దానిలో ఉసిరిని కలిపి చిన్న మంట మీద ఉడికించండి. పది నిమిషాల పాటు అలాగే వదిలేసి ఆ నూనెని ఒక బాటిల్లో వేసుకోండి. ఈ ఆయిల్ ని మీరు 3 నుండి 4 సార్లు వారానికి అప్లై చేసుకోవచ్చు.

అలోవేరా ఆయిల్:

లేదు అంటే మీరు అలోవేరా ఆయిల్ కూడా రాసుకోవచ్చు. దీని కోసం మీరు అర కప్పు కలబంద గుజ్జు తీసుకుని అర కప్పు కొబ్బరి నూనెలో కలిపి మరిగించండి.

ఆ తర్వాత మీరు ఒక బాటిల్ లో ఈ నూనెని వేసుకుని వారానికి రెండు నుండి మూడు సార్లు అప్లై చేసుకోండి. దీని వల్ల కూడా జుట్టు రాలిపోవడం తగ్గుతుంది.

ఆయుర్వేద గుణాలు ఉండే ఈ పదార్థాల వల్ల జుట్టుకి మంచి రక్షణగా ఉంటుంది. సమస్య కూడా ఈజీగా పోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news