చుండ్రు విసిగిస్తుందా…? ఇలా చేయండి…!

80

ఈ రోజుల్లో చుండ్రు సమస్య అనేది చాలా మందిని చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఎన్ని విధాలుగా దాని నుంచి బయటపడాలని చూసినా సరే దాని నుంచి పరిష్కారం మాత్రం దొరకడం లేదు. కాలుష్యం పెరిగిపోవడం కూడా చుండ్రు సమస్యకు కారణంగా మారింది. అయితే దీనికి కొన్ని చిట్కాలు ఉన్నాయని అంటున్నారు. చుండ్రు పోగొట్టాలి అంటే, రెండు టేబుల్‌ స్పూన్ల బ్రౌన్‌ షుగర్‌కు ఒక టేబుల్‌స్పూన్‌ హెయిర్‌ కండిషనర్‌ కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి,

కాసేపటి తర్వాత నీళ్లతో శుభ్రంగా కడుక్కుంటే చుండ్రు సమస్య తొలగిపోతుందని సూచిస్తున్నారు. ప్రతీ నెలా, నెలకు ఒకసారి ఇలా చేస్తే చక్కటి ఫలితం ఉంటుందని అంటున్నారు. సూర్యకిరణాల వల్ల వెంట్రుకలు దెబ్బతింటాయనే మనకు తెలుసు. కాబట్టి జుట్టుకు తేనె, ఆలివ్‌ ఆయిల్‌ మిశ్రమం రాస్తే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు. అరకప్పు తేనెలో రెండు టేబుల్‌స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌ కలిపి వెంట్రుకలకు,

బాగా పట్టించి ఇరవై నిమిషాల తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలని అంటున్నారు. ఆలివ్‌ ఆయిల్‌ వెంట్రుకలకు కండిషనర్‌గా చేస్తుందని, తేనెలో కండిషనర్‌ గుణాలతోపాటు యాంటీ బాక్టీరియల్‌ గుణాలున్నాయని, రేగినట్టు ఉండే చిక్కటి వెంట్రుకలకు అవకడొ గుజ్జును పట్టిస్తే మంచిదని సూచిస్తున్నారు. ఇలా చేస్తే కొంత కాలానికి చుండ్రు సమస్య నుంచి శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉందని అంటున్నారు.