వృద్ధాప్యంలో తెల్లజుట్టురావటం కామన్..కానీ ఇప్పుడు వివిధకారణాల వల్ల నడివయసులోనే జుట్టుతెల్లగా మారిపోతుంది. ఒక వెంట్రకతో మొదలై..మొత్తం తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంది. వీటిని కవర్ చేయడానికి హెయిర్ డైలు వాడుతాం. వాటివల్ల 5 నిమిషాల్లో జుట్టు నల్గగా అవుతుంది కానీ..దీర్ఘకాలికంగా వాడుతూ ఉంటే..కొద్దిగా ఉన్న తెల్లజుట్టు కాస్తా..మొత్తం అయిపోతుంది. ఈ సమస్య వృద్ధులే కాదు యువకులు, యువతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణం అనారోగ్యకరమైన లైఫ్ స్టైల్, సరైన ఆహారం తీసుకోకపోవడం. ఫలితంగా జుట్టురాలటం, తెగిపోవడం, తెల్లగా మారటం జురుగుతుంటుంది. జుట్టురాలే సమస్యను తగ్గించుకోవాలంటే..తల కుదుళ్లను ఆరోగ్యాంగా ఉంచుకోవాలి. అందుకుతగిన ఆహారం, విటిమిన్స్ అందిస్తే..రక్తప్రసరణ బాగా జరిగి జుట్టురాలే సమస్య తగ్గుతుంది. ఈరోజు తెల్లజుట్టును శాశ్వతంగా పోగొట్టే..చక్కటి పరిష్కారం చూద్దాం.
చాలామందికి తెల్లజుట్టుకు బంగాళదుంప పనిచేస్తుందని తెలియదు. ఇప్పటివరకూ చాలానే ట్రై చేసి ఉంటారు. ఓ సారి ఈ బంగాళదుంపను కూడా ట్రై చేయండి. కేవలం తొక్కతోనే కాదు..బంగాళదుంప పేస్ట్ తో సైతం జుట్టుకు బాగా ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ చిట్కాను ఇంకా బాగా అర్థంచేకుకోవాలంటే.. ఆన్ లైన్ లో వీడియోస్ కూడా ఉన్నాయి. అవి చూసి చేయండి.
– Triveni Buskarowthu