మీ ముఖంపై రంధ్రాలు ఉన్నాయా…? అయితే ఈ పద్ధతి మీకోసమే…!

ప్రతీ ఒక్కరు అందం పై శ్రద్ధ వహిస్తారు. మంచి క్రీములు రాయడం, పౌడర్లు అద్దడం ప్రతీ ఒక్కరు చేసేదే. అయితే ఈ విషయం పక్కన పెడితే ముఖం పై రంధ్రాలు గురించి మనం చెప్పుకుని తీరాలి. ఇది నిజంగా పెద్ద సమస్యే. ముఖంపై రంధ్రాలని తొలగించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. మార్కెట్లో దొరికే కాస్ట్లీ క్రీములని కూడా వాడతారు కానీ ప్రయోజనం ఉండకపోవచ్చు. అయితే అటువంటి వాళ్ళు తప్పక ఈ ప్రద్ధతిని అనుసరించండి. సులువుగా ముఖంపై రంధ్రాలని తొలగించొచ్చు.

acne scars
acne scars

మీరు కనుక ఈ క్రీమ్ ని వాడితే కొద్ది రోజుల్లోనే ముఖం మీద రంధ్రాలను తొలగించుకొని నునుపైన చర్మం మీ సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ క్రీమ్ ని డ్రై స్కిన్ అండ్ నార్మల్ స్కిన్ వారి కోసమే. సహజంగా చలి కాలంలో చర్మం బాగా పొడిబారి పోతుంది. దాని కోసం వ్యాజిలీన్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. వ్యాజిలీన్ శరీరానికి కావాల్సిన తేమను అందించి, చర్మం పొడిబారకుండా చేస్తుంది.

ఇక ముఖం పై రంధ్రాల విషయం లోకి వస్తే… పెట్రోలియం జెల్లీ ని తీసుకుని రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆలా చేస్తే పెట్రోలియం జెల్లీ లో ఉండే ఆక్లూజివ్ నేచర్ స్కిన్ రంధ్రాలను పూడ్చి వేసి, చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. మీరు మొదట డబుల్ క్లెన్సింగ్ తో మొదలు పెట్టడం ఉత్తమం. తర్వాత మీ డైలీ స్కిన్ కేర్ రొటీన్ అయిన టోనింగ్, మాయిశ్చరైజేషన్, సీరం వంటివి ఫాలో అవ్వండి. ఆ తరువాత ముఖానికి పెట్రోలియం జెల్లీని అప్లై చేసి రాత్రంతా ఉంచి ఉదయం వాష్ చేసేసుకోండి. ఇలా చేస్తే మీ ముఖం పై రంధ్రాలని తొలగించొచ్చు.